రాములమ్మ ఆగ్రహంలో అసలు ట్విస్టులేంటి?

రాములమ్మ ఆగ్రహంలో అసలు ట్విస్టులేంటి?
x
Highlights

ఫ్రస్ట్రేషన్..ఫ్రస్ట్రేషన్...ఫ్రస్ట్రేషన్...రాములమ్మ ఆగ్రహజ్వాల. ఎందరొచ్చినా ఎన్ని రాయబారాలు నడిపినా చల్లారని కోపాగ్ని గాంధీభవన్‌కు దండం పెట్టి, మరో...

ఫ్రస్ట్రేషన్..ఫ్రస్ట్రేషన్...ఫ్రస్ట్రేషన్...రాములమ్మ ఆగ్రహజ్వాల. ఎందరొచ్చినా ఎన్ని రాయబారాలు నడిపినా చల్లారని కోపాగ్ని గాంధీభవన్‌కు దండం పెట్టి, మరో పార్టీలోకి వెళ్లిపోవాలన్నంత ఆవేశం విజయశాంతిలో ఇంతగా బీపీ రైజ్‌ అవ్వడం వెనక, చాలా కథ వుందా? ఫ్రస్ట్రేషన్‌ వెనక అసలు స్టోరీ ఏంటి?

రాములమ్మకు కోపం వస్తే అంతే. అగ్గిమీద గుగ్గిలమే. సినిమాల్లోనూ, ప్రసంగాల్లోనూ ఆమె ఆవేశపూరిత ప్రసంగమే అందుకు నిదర్శనం. అయితే, సరిగ్గా దుబ్బాక యుద్ధం సమయంలో, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి-విజయశాంతి భేటీతో, అగ్నిపర్వతం బద్దలైందా అన్న చర్చ జరిగింది. వెనువెంటనే పీసీసీ దూతలు ఆమె దగ్గరకు వెళ్లి, శాంతి చర్చలు జరపడం జరిగిపోయాయి. తన ఫ్రస్ట్రేషన్‌కు కారణాలేంటో, సవివరంగా, అదే ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతూ చెప్పారట విజయశాంతి. ఇంతకీ రాములమ్మ బాధేంటి? ఆగ్రహమేంటి? పీసీసీ రాయబారులతో ఆమెం ఏం చెప్పారు?

తెలంగాణ కాంగ్రెస్ తనను అవమానించింది ఇదీ పీసీసీ నేతలతో విజయశాంతి చెప్పిన మాట. కాంగ్రెస్‌ తనను కేవలం ఓట్లు అడిగే మిషిన్‌గానే వాడుకుందన్నారట విజయశాంతి. ఎన్నికల ప్రచారం టైంలోనే, పీసీసీ పెద్దలకు తాను గుర్తొస్తానని, మిగతా పార్టీ కార్యక్రమాల్లో అసలే జ్తప్తికే రానని రగిలిపోయారట. ప్రచార కమిటీ చైర్మన్‌గా తనను ఏమాత్రం గౌరవించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని కస్సుబుస్సులాడారట. ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, పీసీసీ దూతలు సైలెంట్‌ అవుతున్నారట. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, తెలంగాణ ఇచ్చిన పార్టీలో చేరుతానన్న మాట ప్రకారం, కాంగ్రెస్‌లో చేరిన తనపై, పార్టీలో వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారట రాములమ్మ. కేవలం ప్రచారానికి వాడుకునే పోస్టర్‌లాగా, తనను కాంగ్రెస్ వినియోగించుకుందని కోప్పడ్డారట.

ప్రచార కమిటీ చైర్మన్‌గా, తన పట్ల పాటించాల్సిన ప్రోటోకాల్‌ను ఏమాత్రం అమలు చెయ్యడంలేదన్నది రాములమ్మ ప్రధాన కంప్లైంట్. గాంధీభవన్‌లో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు మాత్రమే, ప్రోటోకాల్ పాటిస్తారు, వారి ఫోటోలను మాత్రమే పెడతారు తనను కరివేపాకులా తీసిపారేస్తున్నారన్నది విజయశాంతి, అశాంతికి మరో కారణం. కాంగ్రెస్ అధిష్టానం తనను గౌరవిస్తూ, పార్టీ ప్రచారకమిటి పదవి ఇచ్చినా, రాష్ట్ర అధిష్టానం మాత్రం ఎందుకు పాటించంలేదన్నారట. తన పట్ల సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో కారణాలు చెప్పాలని, తనను బుజ్జగించడానికి వచ్చిన, పార్టీ నేత కుసుమ కుమార్‌ను ప్రశ్నించారట రాములమ్మ. మొత్తానికి పీసీసీ నేతల తీరుపై కోపంతో ఊగిపోతున్న విజయశాంతి, పార్టీ మార్పుపై మాత్రం ఎలాంటి మాటా చెప్పలేదు. అటు బీజేపీకి వెళతాననీ అనలేదు, ఇటు కాంగ్రెస్‌లోనే వుంటానన్న కన్ఫర్మేషనూ ఇవ్వలేదు. చూడాలి, రాములమ్మ దారి, రానురాను ఎలా వుంటుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories