తెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు అడపాదడపా వస్తున్నారు వెళ్తున్నారు.

Arun Chilukuri
Published on: 25 May 2022 5:33 PM IST
Why the PM Modi is not Participating in BJP Programs in Telangana
X

తెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్‌కు అడపాదడపా వస్తున్నారు వెళ్తున్నారు. అధికార కార్యక్రమాలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొని డైరెక్ట్‌గా ఢిల్లీ ఫైట్ ఎక్కేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పీఎం మోడీ తెలంగాణలో ఎందుకు మీటింగ్స్ పెట్టడం లేదు? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేవలం అమిత్‌షా, జేపీ నడ్డా మాత్రమే ఎందుకు వస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్రమోడీని పార్టీ మీటింగ్స్ కోసం రప్పించడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారా? కేబినెట్ సహచరుడిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారా?

ప్రధానమంత్రి మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలని విపక్షాలు డిమాండ్స్ చేస్తుంటే మైక్స్ ముందుకు వస్తున్న బీజేపీ నేతలు నేరుగా ఆయన వస్తారు. మీకు చెప్పాల్సిన సమాధానం చెప్తారని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటం, ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుగుతున్నవేళ కనీసం ఇకముందైనా ప్రధానమంత్రి మోడీ పార్టీ కార్యక్రమాల్లో, పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story