హుజూర్‌ నగర్‌ ప్రచారానికి రేవంత్ రాకపోవడానికి కారణమదేనా ?

హుజూర్‌ నగర్‌ ప్రచారానికి రేవంత్ రాకపోవడానికి కారణమదేనా ?
x
Highlights

హుజూర్‌ నగర్‌ బైపోల్‌, కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడితే, పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్‌ నేతలు పోరాడుతున్నారు....

హుజూర్‌ నగర్‌ బైపోల్‌, కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడితే, పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్‌ నేతలు పోరాడుతున్నారు. అయితే, నల్గొండతో పాటు చుట్టుపక్కల జిల్లాల కాంగ్రెస్‌ నేతలు, రాష్ట్రస్థాయి లీడర్లు కూడా, ప్రచారానికి వెళుతున్నారు. కానీ ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ మాత్రం, అక్కడ అడుగుపెట్టడం లేదు. అందరూ కనపడుతున్నా, ఆయన మాత్రం అసలు అటువైపు చూడ్డంలేదు. అదే ఇప్పుడు, కాంగ్రెస్‌ కార్యకర్తల్లో హాట్‌ టాపికయ్యింది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎందుకు క్యాంపెయినింగ్‌కు వెళ్లడం లేదు?

తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన మనస్పర్ధలు ఇంకా సమిసిపోయిన్నట్లు కనిపించడంలేదు. హుజూర్ నగర్ అభ్యర్ది ఎంపిక విషయంలో, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేదించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, చామల కిరన్ రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చారు. దీంతో పార్టీలో ముఖ్యనేతలంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన చామల కిరన్ రెడ్డిని కనీసం పార్టీ పరిగణలోకి కూడా తీసుకోకుండానే, హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌ సతీమణి పద్మావతిరెడ్డిని ప్రకటించింది పార్టీ.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలను రెండు అధికార పార్టీలు బిజేపి, టిఆర్ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మండలానికో ఇంచార్జీని నియమించి ప్రచారం చేస్తున్నాయి. గెలుస్తామని నమ్మకం లేకున్నా రెండో స్థానం దక్కించుకొని కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బిజేపి. కేంద్ర మంత్రులను రంగంలో దించి రెండో స్థానం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే సిట్టింగ్ సీటును దక్కించుకోవాల్సిన కాంగ్రెస్ మాత్రం ప్రజాదరణ ఉన్న నేతలు బుజ్జగించకుండానే, ఉన్నవారితో ప్రచారం చేసి గట్టెక్కాలనుకుంటోంది.

పార్టీ పీసీసీ అద్యక్షుడు ఉత్తంతో విభేదించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి నేటి వరకూ హాజరుకాలేదు. ఇక ముందు కూడ ప్రచారానికి వస్తారో రారో కూడ పార్టీకి క్లారిటి లేదు. దీనికి తోడు పార్టీ ప్రచార కమిటి చైర్మెన్ విజయశాంతి సైతం ఈ ఎన్నికల్లో ఎక్కడా కనపించడంలేదు. ఆమే ఇప్పటి వరకు ఉప ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. యూత్‌లో క్రేజ్ ఉన్న రేవంత్, మహిళల్లో సినిమా గ్లామర్ ఉన్న రాములమ్మ ఎన్నికల ప్రచారంపై క్లారిటి రాకపోవడంతో పార్టీలో అయోమయం నెలకొంది. ఇద్దరు ముఖ్యనేతలు ప్రచారానికి హాజరుకాకుంటే పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెపుతారనే వాదన కూడపార్టీలో వినిపిస్తోంది. రేవంత్ వివాదానికి తెరపడాలంటే పిసిసి అద్యక్షుడు చొరవ తీసుకుంటేనే సమసిపోతుందని పార్టీలో నేతలు అంటున్నారు. మరి ఉత్తం ఎప్పుడు చొరవ తీసుకుంటరో లేక రేవంతే పార్పీ కోసం ఒక అడుగు ముందుకు వేస్తారో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories