ఎల్లారెడ్డి తాజా-మాజీలపై కేటీఆర్‌ ఎందుకంత సీరియస్‌ అయ్యారు?

ఎల్లారెడ్డి తాజా-మాజీలపై కేటీఆర్‌ ఎందుకంత సీరియస్‌ అయ్యారు?
x
Highlights

ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి ఒకరిపై మరొకరు పోటీ చేశారు. గెలిచిన నేత ఓడిన నేత పార్టీలో...

ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి ఒకరిపై మరొకరు పోటీ చేశారు. గెలిచిన నేత ఓడిన నేత పార్టీలో చేరిపోయారు. అప్పటికే ఉప్పు నిప్పులా ఉండే ఆ ఇద్దరు నేతలు, ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఎడముఖం, పెడముఖంలా ఫేస్‌ టర్నింగ్ ఇచ్చుకున్నారు. నియోజకవర్గంలో తన మాటే చెల్లాలంటే, కాదుకాదు తన మాటే చెల్లాలంటూ, ఎవరికి వారే గ్రూపులు నడిపిస్తున్నారు. అది కాస్తా ఇద్దరి మధ్య వార్ గా మారింది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు ఏంటా స్టోరీ.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్యనే కాకుండా ఇరు నేతల ద్వితీయ శ్రేణి వర్గీయుల మధ్య ఆగాధం పెరుగుతోంది. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరడంతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద రెడ్డికి ప్రాధాన్యం తగ్గుతూ వస్తోందని ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు రెండుగా విడిపోయిన అంశం అధిష్ఠాన పెద్దలను కలవరపెడుతోందట. ఇరు వర్గాల నేతలు ఎవరికి వారే అన్నట్లుగా పనిచేయడం క్యాడర్ కు ఇబ్బందికరంగా మారిందట. దీంతో అటు మొన్నటి జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోను ప్రత్యర్ధి పార్టీల నుంచి గట్టి పోటిని ఎదుర్కోవాల్సి వచ్చిందట.

ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన నల్లమడుగు సురేందర్, అనంతరం టీఆర్ఎస్ గూటిలో చేరారు. దీంతో నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయిందట. ఎమ్మెల్యే సురేందర్ ఏళ్ల తరపడి పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెడుతూ, తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రవేసి సభ్యత్వం నమోదులో సైతం కొందరికి ప్రాధాన్యత ఇవ్వలేదట. టీఆర్ఎస్ పరంగా నిర్వహించే, కార్యకర్తల సమావేశం ఇతరత్రా కార్యక్రమాలకు ఎమ్మెల్యే వర్గం వారికే ఆహ్వానం ఉంటోందని, మాజీ ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రవేసి తమకు పిలవడం రావడంలేదని మరోవర్గం వారు ఆగ్రహంతో ఉన్నారట. నియోజకవర్గంలోని గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్ మండలాల్లో పూర్తిగా రెండు వర్గాలుగా టీఆర్‌ఎస్ విడిపోవడంతో క్యాడర్‌లో అయోమయం నెలకొందట. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిండేంట్ కేటీఆర్ దగ్గరకు చేరిందట.

ఇక ఇన్ని రోజులు అంతర్గతంగా జరిగిన వర్గ పోరు, ఇప్పుడు బాహాటంగానే నడుస్తోందట. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనవాళ్లు లేకుండా చెయ్యాలని, తాజా ఎమ్మెల్యే పట్టుదలతో ఉంటే నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మాజీ ఎమ్మెల్యే సైతం పావులు కదుపుతున్నారట. ఇలా ఇద్దరి మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉందట. ఎల్లారెడ్డి రాజకీయాలు ఏనుగు వర్సెస్ నల్లమడుగుగా మారాయట. ఇద్దరు నేతల మధ్య క్యాడర్ సైతం నలిగిపోతుందట. ఏ వర్గం వైపు ఉండాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు కార్యకర్తలు. దీనిపై పార్టీ స్పందించి వెంటనే, పరిష్కార మార్గం చూపకపోతే ఇది ఇంకా పెరిగే అవకాశలు లేకపోలేదంటున్నారు అనుచరులు.


Show Full Article
Print Article
Next Story
More Stories