Laxman: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదా

Why Fear A Special Session Of Parliament Says Laxman
x

Laxman: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదా

Highlights

Laxman: తమిళనాడు మంత్రి వ్యాఖ్యలపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోరెందుకు మెదపడం లేదు

Laxman: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలంటే ప్రతిపక్షాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయిన బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్‎‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే బిల్లులను ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారాయన... పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల అంశంపై చట్టం తీసుకొస్తారని చెబుతున్న ప్రతిపక్ష పార్టీలు.. ఎందుకు భయపడుతున్నాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. జమిలి ఎన్నికల అంశంపై విమర్శలు చేస్తున్న టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... తమిళనాడు సీఎం కుమారుడు, తమిళనాడు మంత్రి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేస్తే... నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు.. ప్రతిపక్షాలకు హిందువుల ఓట్లు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories