తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?
x

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

Highlights

Telangana Next CS: రాష్ట్ర పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన చీఫ్ సెక్రటరీ పోస్ట్ కోసం అప్పుడే రేస్ మొదలయిందా..?

Telangana Next CS: రాష్ట్ర పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన చీఫ్ సెక్రటరీ పోస్ట్ కోసం అప్పుడే రేస్ మొదలయిందా..? ఆ కుర్చీపై సచివాలయంలో ఇప్పుడు పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ డ్రామా హాట్ హాట్‌ టాపిక్‌గా నడుస్తోందా..? సైలెంట్ వార్, ఇంటెన్స్ లాబీయింగ్ స్టార్ట్ అయిందా...? ప్రస్తుతం రామకృష్ణ రావు తర్వాత ఇంతకీ నెక్స్ట్ సీఎస్ ఎవరు...? సచివాలయ వర్గాలలో పాటు పొలిటికల్ సర్కిల్ లో జరుగుతున్న చర్చ ఏంటి...?

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31తో ముగియబోతోంది. 2025 ఏప్రిల్ 30న రామకృష్ణారావు సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగష్టు 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీస్ ను ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. ఇప్పటికే ఒకేసారి ఏడు నెలలు సర్వీస్ పొడిగింపు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో తర్వాత సీఎస్ ఎవరు..? అన్న చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.

సీనియారిటీ లెక్కల ప్రకారమైతే అందరికంటే ముందుండాల్సిన అరవింద్ కుమార్ పేరు ఇప్పుడు పూర్తిగా సైడ్ అయిపోయింది. ఫార్ములా ఈ రేసు పేరుతో సుమారు 55 కోట్ల ప్రజాధనం నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి..ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై కూడా రాజకీయ దుమారం చెలరేగింది..అదిప్పుడు కీలక మలుపు తిరిగింది. కేంద్రం అరవింద్ ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏసీబీ చార్జ్‌షీట్ సిద్ధం చేయడంతో… సీఎస్ రేసులో అర్వింద్ కుమార్ పేరు దాదాపు ఔట్ అయిపోయిందన్న టాక్ సచివాలయంలో నడుస్తోంది.

ఇక ఆ తర్వాత రేసులో ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఉన్నారు. అందులో జయేష్ రంజన్ కే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories