టీపీసీసీ కొత్త సారధి కోసం మొదలైన వేట

టీపీసీసీ కొత్త సారధి కోసం మొదలైన వేట
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి కోసం వేట ప్రారంభం అయింది. సీనియర్లు వర్సెస్ కొత్తగా వచ్చినవాళ్లు అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది పార్టీలో ! దీంతో కొత్త...

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి కోసం వేట ప్రారంభం అయింది. సీనియర్లు వర్సెస్ కొత్తగా వచ్చినవాళ్లు అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది పార్టీలో ! దీంతో కొత్త బాస్ ఎవరన్న ఆసక్తి నేతల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ హైదరాబాద్ చేరుకోవడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి కోసం వేట షురూ అయింది. గ్రేటర్‍‌ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పదవి కోసం పోటీ పెరగ్గా ఉత్తమ్ వారసుడిగా ఎవరు రాబోతున్నారన్న పార్టీ కార్యకర్తలు ఆసక్తి చూపిస్తున్నారు. పదవి తమదంటే తమదని పార్టీలో సీనియర్లు ఎవరికివారు చెప్పుకుంటుండడంతో అధ్యక్ష రేస్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కూడా రంగంలోకి దిగడంతో ఈ విషయం మరింత ఉత్కంఠ రేపుతోంది.

కోర్ కమిటీ నేతలతో వరుసగా నాలుగు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో గురువారం భేటీ కానున్నారు. అలాగే ఎంపీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, డీసీసీలతోనూ ఠాగూర్‌ సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ ఎంపికపై అందరి అభిప్రాయాలను సేకరించి మెజారిటీ నేతల నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

ఓ వైపు పీసీసీ బాస్ ఎంపికకు సంబంధించి ఓ వైపు ప్రయత్నాలు జోరుగా సాగుతుంటే అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాదాపు ఎనిమిది మంది నేతలు రేసులో ఉన్నారు. సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పదవి కోసం ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఐతే ఇలాంటి పరిస్థితుల మధ్య మాణికం ఠాకూర్ అందరి అభిప్రాయాలు సేకరించే పనిలో ఉన్నారు.

ఇక్కడ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు సరే.. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుంది.. కాంగ్రెస్‌కు కొత్త సారధి ఎవరు.. సీనియర్లా.. కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లా.. ఎవరికి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ జోరుగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories