రాజన్న గుడిలో రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్న మేడమ్ ఎవరు?

రాజన్న గుడిలో రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్న మేడమ్ ఎవరు?
x
రాజన్న గుడిలో రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్న మేడమ్ ఎవరు?
Highlights

భక్తిపారవశ్యం పరవళ్లు తొక్కాల్సిన వేములవాడ రాజన్న సన్నిధిలో, రాజకీయ రగడ రచ్చరచ్చ చేస్తోంది. కానుకలు, లడ్డూలు మొదలుకుని, ప్రతి నాయకుడూ ఆలయ వ్యవహారాల్లో...

భక్తిపారవశ్యం పరవళ్లు తొక్కాల్సిన వేములవాడ రాజన్న సన్నిధిలో, రాజకీయ రగడ రచ్చరచ్చ చేస్తోంది. కానుకలు, లడ్డూలు మొదలుకుని, ప్రతి నాయకుడూ ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వివాదమవుతోంది. అయితే, ఓ మహిళా అధికారి మాత్రం, వారి ఆటలు సాగనివ్వడం లేదట. దీంతో పొలిటికల్ లీడర్స్‌, ఆ లేడీ ఆఫీసర్‌కు మధ్య, రాజన్న ఆలయంలో పెద్ద యుద్ధమే జరుగుతోందట.

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద శైవక్షేత్రం వేములవాడ. తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు. అయితే, ఆలయంలో రాజకీయాలను చూసి, భక్తులకు విసుగొస్తోందట. ఏవోగా ఎవరొచ్చినా ఇక్కడ పని చేసే ఉద్యోగులకు, లోకల్ రాజకీయ నాయకులకు మధ్య సమన్వయం ఉంటే ఓకే లేదంటే మాత్రం ఆ రాజకీయాలు టెంపుల్ దాటి బయటకి పాకేస్తుంటాయ్. అయితే ఇప్పుడున్న ఇంచార్జి ఈవో కృష్ణవేణి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే.

ఆమె దేవస్థానంలో ఛార్జ్ తీసుకున్నది మొదలు, ఇక్కడి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులలతో అసలు పొసగడం లేదు. ఎంతలా అంటే ఇక్కడి ఉద్యోగులకు ఆమెకి మధ్య, ఎడమొహం పెడమొహమే. అస్సలు మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవట. ఈ విభేధాలతోనే ఇటీవల సమ్మక్క జాతర సీజన్‌లో వచ్చిన భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారన్న విమర్శలొచ్చాయి. రాబోయే శివరాత్రి ఉత్సవాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు భక్తులు. టెంపుల్‌ పాలిటిక్స్‌‌తో భక్తులకు పాట్లు తప్పడం లేదు.

ఉద్యోగులతో పరిస్థితి ఇలా ఉంటే, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ,ప్రతిపక్ష నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మేడమ్‌కు ఇదే పంచాయితీ. ఇటీవల మున్సిపల్ ఎన్నికల తర్వాత భారీగా లడ్డూలు కావాలంటూ అధికార పార్టీ నాయకుడు ఒకరు ఆలయ అధికారులకు కబురుపెట్టారట. కానీ సీన్‌ రివర్సయ్యింది. సదరు అధికారి ఈవో దగ్గరికి వెళ్లి లడ్డూలు పంపించమ్మన్నారని చెబితే, డబ్బులు కట్టి వచ్చి తీసుకెళ్లమను అని ముఖం మీదే చెప్పేశారట. దీంతో పవర్‌ పార్టీ లీడర్‌కు ఫీజులు ఎగిరిపోయాయట. మేడమ్‌తో జరంతా జాగ్రత్తగా వుండాలని, సదరు నేతకు కార్యకర్తలు సూచించారట.

స్ట్రిక్టుగా వున్న ఈవో కృష్ణవేణి వ్యవహారశైలి కొందరికి నచ్చితే, చాలామందికి మింగుడు పడటం లేదు. నిజానికి వేములవాడ ఆలయంలో ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఏళ్లకు ఏళ్లుగా బదిలీలు లేకుండా పాతుకుపోయినవారే. స్థానికంగా అన్ని అంశాల్లో ఆరితేరినవాళ్లే. ఇలాంటి వారితో సర్దుకపోవడం కుదరదని, మొదట్లోనే సిగ్నల్స్ ఇచ్చారు ఈవో. ఈశ్వరుడి విభూది ఎక్కువ తీసుకున్నా పాపమే అంటున్నారట ఈవో కృష్ణవేణి. ఇలా రాజకీయాల్లో మునిగితేలుతున్న సిబ్బంది, బయటి నుంచే పాలిటిక్స్‌ ప్లే చేస్తున్న నేతలపై శివాలెత్తుతున్నారట ఈవో మేడమ్. అందుకే ఈవో అంటే అందరూ హడలిపోతున్నారట. ఆలయంలో రాజకీయాలు చెయ్యాలనుకుంటే, తాటతీస్తానంటున్నారట. అయితే, రాజకీయ నాయకులు మాత్రం, టైం వచ్చినప్పుడు తడాఖా చూపిస్తామంటూ, సైలెంట్‌ అవుతున్నారట.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories