Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం.. చిన్నపిల్లలే టార్గెట్‌గా విక్రయాలు..

Whiskey Ice Cream: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విస్కీ ఐస్‌‌క్రీమ్‌ దందా వెలుగులోకి వచ్చింది. విస్కీ ఐస్‌‌క్రీమ్‌ పార్లర్‌పై‌ దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 Sept 2024 12:04 PM IST
Whisky Ice Cream Found In Hyderabad During Excise Police Raids
X

Whiskey Ice Cream:హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం.. చిన్నపిల్లలే టార్గెట్‌గా విక్రయాలు..

Whiskey Ice Cream: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విస్కీ ఐస్‌‌క్రీమ్‌ దందా వెలుగులోకి వచ్చింది. విస్కీ ఐస్‌‌క్రీమ్‌ పార్లర్‌పై‌ దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. విస్కీ కలిపిన ఐస్‌క్రీమ్‌ను హరికే కేఫ్ ఐస్‌క్రీమ్ పార్లర్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చిన్నపిల్లలే టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది.

ఒక కేజీ ఐస్‌క్రీమ్‌లో 60ML విస్కీ కలుపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. హరికే కేఫ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో 11.5 కేజీల ఐస్‌క్రీమ్‌ను సీజ్‌ చేశారు. సోషల్ మీడియాలో విస్కీ ఐస్‌క్రీమ్‌ పేరుతో పబ్లిసిటీ చేసి మరీ విక్రయాలు జరిపినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story