Top
logo

గులాబీ దళానికి టార్గెట్‌గా మారిన ఆ జాతీయ పార్టీ ఏది..?

గులాబీ దళానికి టార్గెట్‌గా మారిన ఆ జాతీయ పార్టీ ఏది..?
X
Highlights

కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వరంగల్‌లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికలకు...

కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వరంగల్‌లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బలమైన శక్తిగా ఉన్న టిఆర్ఎస్‌‌ను ఎదుర్కోవడానికి రెండు జాతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అటు టీఆర్‌ఎస్‌ కూడా ఓ జాతీయ పార్టీని టార్గెట్ చేస్తూ ఎలక్షన్‌కు రంగం సిద్ధం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి రాజకీయ పరిణామాల్లో మార్పులకు కారణమేంటి...? గులాబీ దళానికి టార్గెట్‌గా మారిన ఆ జాతీయ పార్టీ ఏది..?

తెలంగాణలో మరో ఎలక్షన్స్ సమరం ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్ తో పాటు ఓరుగల్లు లోను ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సమరంలో అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపుతారు. కానీ కాకతీయుల కోటలో ఈసారి అంచనాలకు అందని పోటీ జరిగే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది.

ఇటీవల జరిగిన పరిణామాలు, కరోనా విషయంలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శల ప్రభావంతో అధికార టిఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు నేతలు. అయితే ఈసారి టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ టార్గెట్ మారుతుందని భావిస్తే గులాబీ టీమ్ టార్గెట్ మాత్రం కమలదళంపై పడింది. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ బీజేపీకి కలిసొచ్చేలా ఉండటంతో ఆ పార్టీని సైడ్ చేయాలని టిఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారట.

గ్రేటర్ వరంగల్ లో గత ఎన్నికల్లో అజేయశక్తిగా టిఆర్ఎస్ నిలిచింది. కాంగ్రెస్ 3, బీజేపీ 1 స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. అయితే రెండవసారి టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంట పడటంతో నగరంలో టిఆర్ఎస్ చేసిందేమీ లేదని, పైగా కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ లాంటి స్కీమ్స్ ను ప్రకటించినా ప్రగతి సాధించటంలో ప్రజాప్రతినిధులు ఫెయిల్ అయ్యారు. దీంతో పాటు టిఆర్ఎస్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలు రావడం, రోడ్లు పాడవటం లాంటి అంశాలు టీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి.

మరోవైపు లాక్ డౌన్ సమయంలో ప్రజలను టిఆర్ ఎస్ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఎదురుదాడి చేసాయి. ఇందులో బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభుత్వ తప్పిదాలను ఎక్కుపెట్టి మరి చూపింది. దానికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ చరిత్రలో మొదటిసారి భారీ వరదలు వచ్చి సగం కాలనీలు మునిగిపోయాయి. నాలాలపై అక్రమ నిర్మాణాల వెనుక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని వరంగల్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇటీవల ఇక్కడ బీజేపీ యక్టీవ్ అయ్యింది. ప్రతి విషయంలో టిఆర్ ఎస్ కు ధీటుగా సమాధానం చెపుతూ వస్తుంది. 2 నెలల క్రితం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కోడి గుడ్ల దాడి జరగటం వరదల సమయంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పర్యటించటం టిఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టాయి. మొత్తానికి మారుతున్న పరిణామాలతో ఈసారి గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ బీజేపీ నుంచే అనే చర్చ మొదలైంది. ఈ సమయంలో అధికార పార్టీ, విపక్ష పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Web TitleWhich national party TRS is targeting
Next Story