BJP నేతలపై KTR వ్యంగ్యాస్త్రాలు.. ఈసారి నడ్డా చెప్పులు ఎవరు మోస్తారని ట్వీట్‌..

KTR Tweet: బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు.

Arun Chilukuri
Published on: 27 Aug 2022 1:06 PM IST
Which Ghulam will Carry the Chappal of JP Nadda Today Says KTR
X

BJP నేతలపై KTR వ్యంగ్యాస్త్రాలు.. ఈసారి నడ్డా చెప్పులు ఎవరు మోస్తారని ట్వీట్‌..

KTR Tweet: బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జేపీ నడ్డా తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రమైన సెటైర్లు వేశారు. ఈరోజు జేపీ నడ్డా చప్పల్‌ను ఏ గులాం మోస్తారు?.. తీవ్రమైన పోటీ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

మునుగోడు బహిరంగ సభ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అమ్మవారిని సందర్శించి ఆలయం నుంచి బయటకు వస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అమిత్ షా చెప్పులు తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. బండి సంజయ్‌పై అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలకు దిగింది. ఢిల్లీ నేతల చెప్పులు మోసే నాయకులంటూ టీఆర్ఎస్ నేతలు బహిరంగ విమర్శలు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story