Bandi Sanjay: రుణమాఫీపై రేవంత్ ఎక్కడికి పోతే అక్కడ.. దేవుడిపై ప్రమాణం చేస్తున్నారు
Bandi Sanjay: రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం మొదలైంది
Bandi Sanjay: రుణమాఫీపై రేవంత్ ఎక్కడికి పోతే అక్కడ.. దేవుడిపై ప్రమాణం చేస్తున్నారు
Bandi Sanjay: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ దేవుడిపై ప్రమాణం చేస్తున్నాడని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం మొదలైందన్నారు. రేవంత్ సీటుకి కొందరు కాంగ్రెస్ నాయకులు ఎసరు పెట్టారన్నారు. సీటును కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి.. బీజేపీ, RSSపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పరువు నష్టం దావా వేస్తే రాహుల్ గాంధీకి ఏమైందో ఒకసారి రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రలో భాగమే అన్నారు బండి. కరీంనగర్ లో బండి సంజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి మురుగన్ హాజరయ్యారు.
Next Story




