భాస్కర్ ఎక్కడున్నాడు? పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మావోయిస్ట్ నాయకుడు!

భాస్కర్ ఎక్కడున్నాడు? పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మావోయిస్ట్ నాయకుడు!
x
Highlights

వ్యూహాలు పన్నడంలో దిట్ట పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేయడంలో మేటి పద్మవ్యూహం లాంటి వ్యూహం పన్నినా పోలీసుల చేతికి చిక్కినట్లే చిక్కి కళ్లు గప్పి...

వ్యూహాలు పన్నడంలో దిట్ట పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేయడంలో మేటి పద్మవ్యూహం లాంటి వ్యూహం పన్నినా పోలీసుల చేతికి చిక్కినట్లే చిక్కి కళ్లు గప్పి పారిపోతాడు. గెరిల్లా పోరాటంలో ఆరి తెరిన మావోయిస్టు నాయకుడు భాస్కర్ మావోయిస్టు సామ్రాజ్యం నిర్మిస్తున్న నిర్మాత కదంబ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో తృటిలో తప్పించుకున్న మావోయిస్టు భాస్కర్ ఎక్కడికి పారిపోయాడు?. భాస్కర్‌తో పాటు ఎంత మంది మావోయిస్టులు ఉన్నారు..? పోలీసులకు సవాల్‌గా మారిన భాస్కర్ ఎక్కడున్నాడు అతనితో పాటు ఎంత మంది ఉన్నారు..?

మావోయిస్టు నాయకుడు భాస్కర్ అలియాస్ అడేళ్లు. రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు‌. దండకారణ్యంలో నిర్వహించిన ఎన్నో ఆపరేషన్‌లలో కీలకపాత్ర పోషించాడు. భాస్కర్‌పై వందకు పైగా కేసులు ఉన్నాయి. భాస్కర్‌పై ఇరవై లక్షల రివార్డ్ ప్రకటించింది. అంతటి పట్టున్న భాస్కర్‌ను కుమ్రంబీమ్, మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా నియమించి ఉమ్మడి ఆదిలాబాద్ దండకారణ్యంలో పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించింది కేంద్ర మావోయిస్టు పార్టీ.

పార్టీ నిర్మాణం కోసం భాస్కర్ చురుగ్గా పని చేస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ లో మకాంవేసి పార్టీని పునర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తిర్యాని మండలంలోని దట్టమైన అడవులను స్థావరంగా మార్చుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంత మందిని పార్టీలో చేర్చుకొని బలోపేతం చేసినట్లు సమాచారం. ఆ విషయం నిఘా వర్గాల పోలీసులకు చిక్కింది. దీంతో మావోలను కట్టడి చేయడానికి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. జూలైలో తొక్కిగూడలో భాస్కర్, మిగతా కమిటీ సభ్యులు పోలీసులకు తారసపడ్డారు. ‌మావోలు-పోలీసులపై కాల్పులు జరపగా భాస్కర్, కమిటీ సభ్యులు తప్పించుకున్నారు.

అయితే భాస్కర్ తప్పించుకున్న ఎన్ కౌంటర్లు 50 వరకు ఉన్నాయి. అంటే దండకారణ్యంలో భాస్కర్ కు గెరిల్లా పోరాటంలో ఎంత పట్టుందో అర్థమవుతుంది. భాస్కర్, కమిటీ సభ్యులను కట్టడి చేయడానికి స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. భాస్కర్, కమిటీ సభ్యులను పట్టుకోవడానికి ఆసిఫాబాద్ లో డీజీపీ ఐదురోజులపాటు మకాం వేసి పోలీసులకు దిశా నిర్థేశం చేశారు‌‌. తాజాగా మళ్లీ భాస్కర్, అతని కమిటీ సభ్యులు కదంబ ఎన్ కౌంటర్ లో తప్పించుకోవడం పోలీసులకు పెను సవాలుగా మారింది.

తప్పించుకున్న మావోయిస్టు నాయకుడు భాస్కర్ కదంబ పరిసర అడవుల్లో సంచరిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. భాస్కర్, కమిటీ సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు వందల బలగాలను దించారు. సరిహద్దు దాటకుండా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు బూటకపు ఎన్ కౌంటర్ కు పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని లేఖలో హెచ్చరికలు జారీచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories