మునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
Munugode Bypolls: మునుగోడులోనే కాదు.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే విజయమన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్.
Munugode Bypolls: మునుగోడులోనే కాదు.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే విజయమన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు కేవలం బీజేపీవల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికల ముందుగాని, ఎన్నికల తర్వాత గానీ పొత్తు పెట్టుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. దక్షిణ భారత్‌కు తెలంగాణ గేట్ వేగా ఉంటుందని డాక్టర్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరేందుకు ఎందరో నాయకులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మునుగోడులో ఈ నెల 21న బీజేపీ అగ్రనేత అమిత్ షా బహిరంగ సభ ఉంటుందన్నారు.
Next Story




