విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన.. వాట్సప్ చదువు!

విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన.. వాట్సప్ చదువు!
x
Highlights

Whatsap Education For Students: కరోనా పుణ్యమా అని అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఆ కోవలో పాఠశాలలకు పిల్లలు పోయి 5 నెలలు దాటింది. పాఠ్యాంశాలతో ఎల్లప్పుడు విద్యార్ధులు టచ్ లో ఉండాలి. లేకపోతే అంతా మరిచిపోవడంతో పాటు చదువుకునే అలవాటు తప్పుతుంది. అలా కాకుండా ఉండేందుకు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడో చూడండి.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సపూర్ ప్రభుత్వ పాఠశాలలో నర్సయ్య ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కరోనా కారణంతో గత కొన్ని నెలలుగా పాఠశాలలు మూతపడ్డాయి. వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాలేదు. దీంతో చాలా వరకు పిల్లలు పుస్తకాల సంగతి మర్చిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్ధులు చదువులో వెనకబడిపోతారు. దీన్ని గ్రహించిన నర్సయ్య వాట్సాప్ యాప్ ద్వారా విద్యార్ధులకు ఇంటి దగ్గర్నుంచే విద్యాభ్యాసం చేయిస్తున్నాడు.

లాక్ డౌన్ కారణంగా విద్యార్ధులు ఇంటి పట్టునే ఉంటున్నారు. వారిలో నైపుణ్యం పెంపొందించే విధంగా నర్సయ్య వినూత్నంగా ఆలోచించి, వాట్సాప్ ద్వారా పాఠాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బడిలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించి "పిల్లలతో ముఖాముఖి" అని వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లల కోసం ప్రశ్నావళిని సిద్ధం చేసి గ్రూపులో పోస్ట్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూర్చోబెట్టి జవాబులు రాయించి తిరిగి గ్రూపులో పెడుతున్నారు. అలా రోజుకో సబ్జెక్ట్ ను చదివించి గ్రూపులో పిల్లలు పెట్టే సమాధానాలకు మార్కులు వేస్తూ వారిని ఉత్సాహ పరుస్తున్నాడు నర్సయ్య. ఈ కార్యక్రమం గడిచిన 70 రోజుల నుంచి కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ఇది వరకు నేర్చుకున్న అంశాలను మరిచిపోకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. తమ పిల్లల కోసం నర్సయ్య చేస్తున్న సేవలకు గాను తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories