బతుకమ్మ తేదీలపై రగడెందుకు.. కవిత గ్రాండ్ రీఎంట్రీకి లింకేంటి ?

బతుకమ్మ తేదీలపై రగడెందుకు.. కవిత గ్రాండ్ రీఎంట్రీకి లింకేంటి ?
x
Highlights

తెలంగాణ బతుకమ్మ సంబురాలకు ముహూర్తం ఫిక్సయ్యింది. తేదీలు ఖరారయ్యాయి. ఉత్సవాల సన్నాహం మొదలైంది. అయితే, కొందరు పండితులు, ఈ తేదీల కన్‌ఫామ్‌పై...

తెలంగాణ బతుకమ్మ సంబురాలకు ముహూర్తం ఫిక్సయ్యింది. తేదీలు ఖరారయ్యాయి. ఉత్సవాల సన్నాహం మొదలైంది. అయితే, కొందరు పండితులు, ఈ తేదీల కన్‌ఫామ్‌పై కాస్త అసహనంగా వున్నారట. ఎవరి కోసం ఈ డేట్స్‌ను సెలక్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారట. అయితే, బతుకమ్మ పండగ తేదీలకు, మాజీ ఎంపీ కవిత గ్రాండ్‌ పొలిటికల్ రీఎంట్రీకి ఏదో లింకుందన్న వాదన చర్చనీయాంశమైంది. ఇంతకీ బతుకమ్మ సంబరాలకు, కవిత రాజకీయ పునరాగమనానికి సంబంధమేంటి? తేదీలపై వివాదమేంటి?

నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైందా..? బతుకమ్మ పండగతో ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారా...? బతుకమ్మ తేదీల ప్రకటన వెనుక కారణం అదేనా...? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నిజామాబాద్ ఎంపీగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ ఎంపీ కవిత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఏడాది పాటుగా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ధిగా కవితను ఖరారు చేయడం, నామినేషన్ దాఖలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనం అనుకున్న తరుణంలో కరోనా రూపంలో ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఆమె అనుచరులు తీవ్ర నిరాశ పడ్డారు. ఎన్నిక వాయిదా వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనే టాక్ కూడా నడిచింది. ఎంపీగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కవిత ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోను తనదైన ముద్ర వేస్తుందనుకున్న అనుచరులకు ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారట. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి జిల్లాకు వచ్చిన పార్ధసారథిని జిల్లా నేతలు కలిసి ఎమ్మెల్సీ ఎన్నిక సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని కోరారట. కవిత రీ ఎంట్రీని బలంగా కోరుకుంటున్న నేతలు పొలిటికల్ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో తెలియక సతమతమవుతున్నారట. ఫోన్లు చేసి జిల్లాలో అడుగుపెట్టాలని ఒత్తిడి తెస్తున్నారట. ఐతే కవిత సైతం పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని, ఎంపీగా ఓడిపోయిన చోట ఎమ్మెల్సీగా గెలిచి తన సత్తా చాటాలని చూస్తున్నారట కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరోలా తలచినట్లు ఎన్నిక వాయిదా ఆమెను ఒకింత నిరుత్సాహానికి గురి చేసింది. అయితే, నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చే, సంబురానికి కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారట కవిత.

పొలిటికల్ గా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చేందుకు స్కెచ్ వేసిన మాజీ ఎంపీ కవితకు, ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడటం ఆమె అనుచరులకు మింగుడు పడటం లేదు. అక్క ఎంట్రీ ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్న తరుణంలో బతుకమ్మ పండగతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారనే టాక్ కార్యకర్తల్లో నయా జోష్ నింపుతోందట. బతుకమ్మ పండగ నాటికి ఎమ్మెల్సీ ఎన్నిక సైతం పూర్తయ్యే అవకాశం ఉందనే టాక్ సైతం నడుస్తోందట. ఎమ్మెల్సీగా బతుకమ్మ పండగలో జాగృతి అధ్యక్షురాలు కవిత యాక్డివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందట. అందులో భాగంగానే ఆమె తెలంగాణ సిద్దాంతులు, పండితుల సమక్షంలో బతుకమ్మ తేదీలను ప్రకటంచారట. రెండేళ్లుగా బతుకమ్మ పండగలో అంత యాక్టివ్ గా పాల్గొనని కవిత ఈసారి బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు తెలంగాణ ఆడపడచులు బతుకమ్మ పండగ జరుపుకోవాలని స్వయంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించడం వెనుక గ్రాండ్ రీఎంట్రీ స్ట్రాటజీ ఉందనే టాక్ సాగుతోంది. అయితే, బతుకమ్మ తేదీల ఖరారుపై వివాదం కూడా రాజుకోవడం, కవిత అనుచరులకు మింగుడుపడటం లేదు.

కవిత చెప్పే వరకు పండితులు బతుకమ్మ తేదీలు ఖరారు చెయ్యలేదంటూ, కొందరు విమర్శిస్తున్నారు. కేవలం కవిత కోసమే డేట్స్ ఫిక్స్ చేశారని కొందరు పంతుళ్లు వాదిస్తున్నారు. విమర్శలు, వివాదాలు ఎలా వున్నా, కవిత రీఎంట్రీకి బతుకమ్మ సంబరాలు వేదిక కాబోతున్నాయని అనుచరులు ఎగిరి గంతేస్తున్నారు. కవిత రాజకీయ ప్రస్థానం మరో మలుపు తిరగబోతోందని అంచనాలు వేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories