ఆ రోజు గాంధీభవ‌న్‌లో భూకంపమేనా?

ఆ రోజు గాంధీభవ‌న్‌లో భూకంపమేనా?
x
Highlights

డిసెంబర్‌ తొమ్మిదిన టీ కాంగ్రెస్‌లో ఏం జరగబోతోంది? ఆ రోజు గాంధీభవ‌న్‌లో భూకంపమేనా? అలజడి రేగడం ఖాయమా? ఢిల్లీ అధిష్టానం ఓ సెన్సేషనల్ డెసిషన్‌కు రెడీ...

డిసెంబర్‌ తొమ్మిదిన టీ కాంగ్రెస్‌లో ఏం జరగబోతోంది? ఆ రోజు గాంధీభవ‌న్‌లో భూకంపమేనా? అలజడి రేగడం ఖాయమా? ఢిల్లీ అధిష్టానం ఓ సెన్సేషనల్ డెసిషన్‌కు రెడీ అయ్యిందా? డిసెంబర్‌ తొమ్మిదినే ముహూర్తంగా ఎందుకు ఎంచుకుంది? ఆరోజుకున్న ప్రత్యేకత ఏంటి? అసలేం జరగబోతోంది డిసెంబర్ నైన్త్?

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కథేంటి...? ఈ ప్రశ్నకు ఆ పార్టీ నాయకుల దగ్గరే ఆన్సర్‌ లేదు. అధిష్టానం దగ్గరా సమాధానం లేదు. ఏదో పోటీలో నిలబడ్డాం, అభ్యర్థులను ప్రకటించాం, ప్రచారం చేశాం ఇంతే. మమ అనిపించేశారు ఖద్దరు నేతలు. ఢిల్లీ హైకమాండ్‌ కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. బీజేపీ ఢిల్లీ అగ్రనాయకత్వమంతా వరుసబెట్టి, గ్రేటర్‌లో ల్యాండవుతున్నా, ఓడిపోయేదానికి ఎందుకు ప్రచారం అన్నట్టుగా, కాంగ్రెస్ నేషనల్‌ లీడర్స్‌ భాగ్యనగరానికి రాలేదు. అయితే, ఎన్నికలు ముగిశాయి. బల్దియాపై కాంగ్రెస్‌కు హోప్స్ లేవు. మరి నెక్ట్స్ ఏంటి? శతాధిక పార్టీలో ప్రక్షాళన సమయం ఆసన్నమైందా? అందుకు ముహూర్తం ఖరారైందా?

డిసెంబర్‌ 9. ఈ తేదీకి తెలంగాణలో చాలా ప్రాముఖ్యత వుంది. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది ఈ తేదీనే. అంతేకాదు, ఈ డేట్‌కు మరో ప్రత్యేకత కూడా వుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు. సరిగ్గా ఇదే డిసెంబర్‌ 9, తెలంగాణ కాంగ్రెస్‌లో మరో సంచలన తేదీగా మారబోతోందని, గాంధీభవన్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ చర్చ. ఇంతకీ డిసెంబర్ 9న టీ కాంగ్రెస్‌లో ఏం జరగబోతోంది?

తెలంగాణ కాంగ్రెస్‌ సమూల ప్రక్షాళన. పునర్‌వైభవం దిశగా మలి అడుగు అంటున్నారు ఖద్దరు నేతలు. ఇంతకీ డిసెంబర్‌ 9న ఏం చెయ్యబోతున్నారు? పీసీసీ మార్పు ఔను పీసీసీ మార్పు. తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన సారథి నియామకం అట. కాంగ్రెస్‌కు పూర్వవైభవం దిశగా ఇదొక కీలకమైన మలుపు అట. మరి తెలంగాణ కాంగ్రెస్‌ సింహాసనంపై ఎవరు కూర్చోబోతున్నారు? డిసెంబర్‌ 9న గాంధీభవన్‌ హాట్‌ సీటుపై ఎవరు ఆసీనులు కాబోతున్నారు?

రేవంత్‌ రెడ్డి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. డైనమిక్‌ లీడర్‌గా కాంగ్రెస్‌ కార్యకర్తలు చెప్పుకునే నాయకుడు. డిసెంబర్‌ 9, రేవంత్‌ రెడ్డికి పట్టాభిషేకమట. పీసీసీ మార్పు ఎప్పుడో జరగాల్సింది. కానీ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. దానికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు, దుబ్బాక పోరు, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌ ఎలక్షన్స్. వరుసగా ఎన్నికలు రావడంతో, పీసీసీ సారథి నియామకం లేటవుతూ వచ్చింది. ఇప్పుడు నాగార్జున సాగర్‌ తప్ప, మరో ఎన్నిక లేదు. దీంతో ఇదే సరైన సమయమని, రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా అపాయింట్‌ చేసి, పార్టీలో కొత్త జవసత్వాలు నింపాలని డిసైడ్ అయ్యిందట కాంగ్రెస్ హైకమాండ్.

తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్‌ను రీప్లేస్ చేసి, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కావాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. కమలానికి ఇఫ్పటికైనా బ్రేక్ వెయ్యకుంటే, ఏపీ తరహాలో, తెలంగాణలోనూ కాంగ్రెస్ సమాధేనని, ఢిల్లీ హైకమాండ్ ఇప్పటికైనా గ్రహించిందన్న చర్చ జరుగుతోంది. అందుకే గాంధీభవన్‌లో భూకంపం వచ్చినా, సీనియర్లు రెచ్చిపోయినా, రేవంత్‌కు పట్టాభిషేకం చేస్తే, ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయని భావిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. అందుకు డిసెంబర్‌ 9ని ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో, కాంగ్రెస్ తరపున క్రౌడ్‌ పుల్లర్‌గా తిరిగింది రేవంత్‌రెడ్డి ఒక్కరేనని అధిష్టానానికి అప్పుడే రిపోర్ట్‌లు వెళ్లాయట. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ అక్కడక్కడా తప్ప, మరెక్కడా దర్శనమివ్వలేదట. ఎప్పుడూ గొంతుచించుకుని అరిచే అసమ్మతి నేతలు కూడా, అభ్యర్థులను గెలిపించే బాధ్యతను తీసుకోలేదు. రేవంత్‌ ఒక్కడే, గ్రేటర్‌లో తిరిగారట. తన పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరిపైనే ఎక్కువగా దృష్టిపెట్టినా, తనను ఆహ్వానించిన ఇతర నియోజకవర్గాలకూ వెళ్లి క్యాంపెయిన్ చేశారట రేవంత్‌ రెడ్డి. ఒకరకంగా గ్రేటర్ ఎన్నికల్లో, రేవంత్‌ రెడ్డి తప్ప మరో నేత కనపడలేదు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి అయితేనే, ప్రత్యర్థి పార్టీలకు దీటుగా పోరాడగలడని నమ్ముతోందట కాంగ్రెస్ హైకమాండ్. డిసెంబర్ 9న రేవంత్‌ను పీసీసీ చీఫ్‌ ప్రకటించడం ఖాయమని, ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయట. చూడాలి, తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, సోనియా గాంధీ పుట్టిన రోజయిన డిసెంబర్‌ 9న, గాంధీభవన్‌లో కొత్త జోష్ వస్తుందో, లేదంటే భూకంపమే వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.


Show Full Article
Print Article
Next Story
More Stories