నిజామాబాద్‌ మున్సిపల్‌ రిజల్ట్‌తో కవిత గురించి జరుగుతున్న చర్చేంటి?

నిజామాబాద్‌ మున్సిపల్‌ రిజల్ట్‌తో కవిత గురించి జరుగుతున్న చర్చేంటి?
x
నిజామాబాద్‌ మున్సిపల్‌ రిజల్ట్‌తో కవిత గురించి జరుగుతున్న చర్చేంటి?
Highlights

ఆ కార్పొరేషన్‌లో అధికార పార్టీ జెండా ఎగిరింది కానీ ఆ నేతలకు సంతోషం కరువైంది. మేయర్ పీఠం చేజిక్కింది కానీ అధిష్ఠానం దృష్టిలో గెలిచి ఓడారనే భావన...

ఆ కార్పొరేషన్‌లో అధికార పార్టీ జెండా ఎగిరింది కానీ ఆ నేతలకు సంతోషం కరువైంది. మేయర్ పీఠం చేజిక్కింది కానీ అధిష్ఠానం దృష్టిలో గెలిచి ఓడారనే భావన తలదించుకునేలా చేస్తోంది. సీఎం పెట్టిన పరీక్షలో సదరు ఎమ్మెల్యే గెలిచారో....? ఓడారో తెలియక పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. ఆమె ప్రచారానికి వచ్చి ఉంటే పరిస్ధితి వేరేలా ఉండేదా..? అసలు ఇందూరు కార్పొరేషన్‌లో గులాబీ లెక్క ఎలా తప్పింది? ఇప్పుడు ఇందూరు పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చేంటి...? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

నిజామాబాద్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగిరింది. చావు తప్పి కన్నులొట్ట పోయినట్లుగా మూడో స్ధానానికి పరిమితమైన గులాబీ పార్టీ, ఎంఐఎంతో జతకట్టడం, ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో మేయర్ స్ధానాన్ని చేజిక్కించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు గులాబీ లెక్క ఎలా తప్పిందనే చర్చ పార్టీలో వాడివేడిగా సాగుతోంది.

సీఎం పెట్టిన పరీక్షలో స్ధానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాసయ్యారా..? ఫెయిల్ అయ్యారా.? అన్న చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా 30 స్ధానాలకు పైగా గెలుస్తుందని కొందరు గులాబీ నేతలు గాలిలో లెక్కలేశారట. అభ్యర్ధుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తగిన మూల్యం చెల్లించారనే టాక్ వినిపిస్తోంది. కొందరు కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా వేసుకోవడమే ఆలస్యం టికెట్లు ఇవ్వడం, ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడం, ఎలాగైనా గెలుస్తామనే అతి విశ్వాసం ఇలా కర్ణుని చావుకి సవాలక్ష కారణాలన్నట్లు గులాబీ పార్టీ మూడో స్ధానానికి పరిమితం కావడానికి అనేక కారణాలున్నాయట. ఫలితాల పట్టికలో మూడో స్ధానంలో ఉన్నా మేయర్ పీఠం దక్కించుకోవడం పట్ల సంతోష పడాలో అధికారంలో ఉండి మూడో స్ధానానికి పరిమితం అయినందుకు బాధ పడాలో తెలియని పరిస్ధితిలో అధికార పార్టీ నేతలు కుమిలిపోతున్నారట. పరువు పోయి పదవి దక్కిందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ఫలితాల తీరుపై అర్బన్ నేతలపై అధిష్ఠానం గుర్రుగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ కవిత లోటు స్పష్టంగా కనిపించిదన్న చర్చ జరుగుతోంది. ఆమె ప్రచారంలో పాల్గొంటే ఫలితాలు మరోలా ఉండేవనే టాక్ వినిపిస్తోంది. ఎంపీ అర్వింద్ గులాబీ పార్టీని టార్గెట్ చేసి కౌంటర్ ఇస్తే అధికార పార్టీ నేతలు రివర్స్ కౌంటర్ ఇవ్వడంలో విఫలం అయ్యారట. టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ గా ఎంఐఎం అభ్యర్ధి అవుతారని బీజేపీ నేతలు ప్రచారం చేసి సక్సెస్ అయితే అది తప్పని చెప్పడంలో టీఆర్ఎస్ నేతలు ఫెయిల్ అయ్యారట. అందుకే బీజేపీ 28 డివిజన్లు గెలిచి ఫలితాల పట్టికలో అగ్రస్ధానంలో ఉంటే అధికార పార్టీ మూడో స్ధానానికి పరిమితమయ్యిందని పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారట. మాజీ ఎంపీ కవిత ప్రచారంలో పాల్గొంటే కచ్చితంగా ఎం.ఐ.ఎం.తో పొత్తు లేకుండానే మేయర్ పీఠాన్ని సాధించేవారట. ప్రస్తుతం మేయర్ పీఠం దక్కించుకున్నామనే సంతోషం కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయనే బాధతో కుమిలిపోతున్నారట. పీఠం దక్కినా నేతల్లో మాత్రం ఆ సంతోషం లేకపోవడానికి స్వయం కృపరాధం కారణం అంటూ గుసగుసలాడుతున్నారట ఆ పార్టీ శ్రేణులు. ఆమె అనుచరులకు, జాగృతి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకపోవడం పట్ల మాజీ ఎంపీ కవిత సైతం నారాజ్ లో ఉన్నారట. అందుకే ప్రచారానికి సైతం ఆమె రాలేదనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో చాలామంది మంత్రులు -ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ పెట్టిన మున్సిపల్ పరీక్షల్లో పాసైతే ఇందూరులో మాత్రం ఆ నేత ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇంతలా పెయిల్ కావడానికి కారణాలేంటన్నది గులాబీ పెద్దలు విశ్లేషిస్తున్నారు. సీట్లు తక్కువగా రావడానికి కారణాలపై విచారణ సైతం చేపట్టేందుకు సిద్దమయ్యారట. మేయర్ పీఠం దక్కించుకోవడంపై గులాబీ బాస్ సంతోష పడతారో తక్కువ సీట్లు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోరో తెలియక తెగ వర్రీ అవుతున్నారట స్ధానిక నేతలు. చూద్దాం అధిష్ఠానం సదరు అర్బన్ నేతలకు ఎన్ని మార్కులిస్తుందో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories