హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో మోస్తరు వర్షాలు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురవగా కూకట్‌పల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌లో మోస్తరు వర్షం కురిసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో దుబ్బాకలో 82 మిల్లీ మీటర్లు, కొండపాకలో 70.3 మి.మీ వర్షాపాతం నమోదవ్వగా, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 14 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, కుమ్రంభీం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురవగా పలు చోట్ల జల్లులు పడ్డాయి.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని చెప్పింది. తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories