Hyderabad Weather: హైదరాబాద్ లో ఒక్క సారిగా మారిన వాతావరణం

Telangana: హైదరాబాద్ పరిధిలో గత అర్థరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

Kranthi
Published on: 19 Feb 2021 8:48 AM IST
Hyderabad Weather: హైదరాబాద్ లో  ఒక్క సారిగా మారిన వాతావరణం
X

Hyderabad: గ్రేటర్ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత అర్థరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, నాగోల్‌, సైదాబాద్‌, రామంతాపూర్‌, నారాయణగూడ, గౌలిదొడ్డి, హిమాయత్‌నగర్‌, ఆర్‌కేపురం, బహదూర్‌పురా, పురానాపూల్‌, దూద్‌బౌలి, లంగర్‌హౌస్‌, అత్తాపూర్‌, ఉప్పర్‌పల్లి, నాంపల్లి, జియాగూడ, ఖైరతాబాద్ తదితర‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అకస్మాత్తుగా కురిసిన వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, వడ‌గ‌ళ్లతో కూడిన వర్షం కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ మధ్య మహా‌రాష్ట్ర వరకు ఏర్పడిన ఉప‌రి‌తల ద్రోణి ప్రభావంతో, వర్షం కురిసింది.ఈ ద్రోణి ప్రభావంతో... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాకశముందని వెల్లడించింది.

Kranthi

Kranthi

Next Story