Rain Alert Today: తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్

Rain Alert Today: బంగాళాఖాతంలో అల్పపీడనం, తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి...

Shireesha
Published on: 3 Nov 2021 8:51 AM IST
Weather Forecast says Chances of Heavy Rains in Telangana | Telugu Online News
X

Rain Alert Today: తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్

Rain Alert Today: తెలంగాణలో నేడు అక్కడక్కడ భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని.. దీని నుంచి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.

వీటి ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురవడంతో పాటు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నిన్న జనగామ జిల్లా కోలుకొండలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Shireesha

Shireesha

Next Story