Weather Alert: తెలంగాణలో మరో 5రోజులు వర్షాలు.. ఎక్కడెక్కడంటే?

తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Arun Chilukuri
Published on: 19 Aug 2024 10:13 AM IST
Weather Alert: తెలంగాణలో మరో 5రోజులు వర్షాలు.. ఎక్కడెక్కడంటే?
X

తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. జనగామ,మహబూబాబాద్,వరంగల్‌ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని... గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ..

ఆంధ్రప్రదేశ్‌లోనూ రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో 72 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story