సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవంగా జరపాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒవైసీ లేఖ..

We Will Organize The Tiranga Yatra On September 17 Says Asaduddin Owaisi
x

సెప్టెంబర్ 17న సమైక్యతా దినోత్సవంగా జరపాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒవైసీ లేఖ..

Highlights

Asaduddin Owaisi : సెప్టెంబర్ 17 న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని మజ్లీస్ చీఫ్ అససుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

Asaduddin Owaisi : సెప్టెంబర్ 17 న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని మజ్లీస్ చీఫ్ అససుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. సెప్టెంబర్ 17 ఉత్సవాలను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని కేంద్రం ఈ 8 ఏళ్లు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తే ఎంఐఎం పాల్గొంటుందని లేకపోతే తామే వేడుకలను నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 16 న మధ్యాహ్నం 2 గంటలకు పాతబస్తీలో మజ్లీస్ పార్టీ తరపున తిరంగా యాత్ర నిర్వహిస్తామని ఒవైసీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు అని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories