Vajresh Yadav: బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటాం

Vajresh Yadav: వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తోటకూర వజ్రేష్ యాదవ్

Shekhar G
Updated on: 2 Sept 2023 4:31 PM IST
We Will Face BRS Head On Says Vajresh Yadav
X

Vajresh Yadav: బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటాం

Vajresh Yadav: బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనిTPCC రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ తెలిపారు. ముఖ్య కార్యకర్తల ఆధ్వర్యంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు డివిజన్ల వారీగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. జవహర్ నగర్ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి జవహర్ నగర్ ప్రజల బుద్ధి చెప్తారని అన్నారు.

దివంగత నేత వై.ఎస్. వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి తోటకూర వజ్రేష్ యాదవ్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్ నగర్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల సరిత వెంకటేష్, సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story