Yashaswini Reddy: పాలకుర్తిలో పైడ్రా తీసుకువస్తాం

Yashaswini Reddy: ఎర్రబెల్లి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 Sept 2024 11:32 AM IST
We will bring HYDRAA in Palakurthy Says Yashaswini Reddy
X

Yashaswini Reddy: పాలకుర్తిలో పైడ్రా తీసుకువస్తాం

Yashaswini Reddy: హైదరాబాద్‌లో హైడ్రా మాదిరి పాలకుర్తిలో పైడ్రా తీసుకువస్తామని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. దేవురుప్పలలో మీడియా సమావేశం నిర్వహించి గత పాలకుల తప్పిదాలను, ఎర్రబెల్లి దయాకర్ విమర్శలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జీ ఝాన్సీ రెడ్డి విమర్శించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముసుగులో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తప్పులు చేస్తే ఎవరికైనా శిక్షలు తప్పవని... అందుకే అభద్రతా భావంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వచ్చామన్నారు ఝాన్సి రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story