DK Shivakumar: ఎమ్మెల్యేల నిర్ణయాన్ని హైకమాండ్‌కు చెప్పాం

We Told The Decision Of The MLAs To The High Command Says DK Shivakumar
x

DK Shivakumar: ఎమ్మెల్యేల నిర్ణయాన్ని హైకమాండ్‌కు చెప్పాం

Highlights

DK Shivakumar: సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది

DK Shivakumar: హస్తినలో హస్తం నేతలు వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం ఎవరనేదానిపై చర్చిస్తున్నారు. ఇక డీకేతో ఉత్తమ్.. థాక్రేతో భట్టి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు.. డీకే శివకుమార్‌తో ఉత్తమ్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సమావేశాల అనంతరం ఏఐసీసీ పరిశీలకులను పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రంలోగా సీఎం అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది.

తెలంగాణకు కాబోయే సీఎం ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో సోమవారం రాత్రే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. అయితే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగినా.. పార్టీలో సీనియర్ నేతలు భట్టి, ఉత్తమ్ కూడా ఆ పోస్టు కోసం పోటీపడడంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడింది.

ఓ ప్రైవేట్ హోటల్‌లో సీఎల్పీ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు నివేదించారు. ఈ విషయంపై మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై సాయంత్రంలోగా స్పష్టతనిస్తామని ప్రకటించారు.

తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించి ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్ తో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర పరిశీలకులు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories