MLC Kavitha: తెలంగాణలో మళ్లీ అధికారం మాదే.. వంద సీట్లతో సర్కారు ఏర్పాటు చేస్తాం

MLC Kavitha: ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ రైతులు

Shekhar G
Published on: 26 Oct 2023 1:48 PM IST
We Are In Power Again In Telangana Says MLC Kavitha
X

MLC Kavitha: తెలంగాణలో మళ్లీ అధికారం మాదే.. వంద సీట్లతో సర్కారు ఏర్పాటు చేస్తాం

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనన్న ఎమ్మెల్సీ కవిత.. వంద సీట్లతో సర్కారు ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ పథకాల సృష్టికర్త అని.. ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారామె. ఇక కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదన్నారు. ఎంపీ అర్వింద్‌ను ఓడించి తీరుతామన్న కవిత... బీజేపీకి తెలంగాణలో స్కోప్ లేదు.. ప్రజల్లో విశ్వసనీయత లేదు.. గాంధీలకే గ్యారంటీ లేదని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. బీసీలకు కాంగ్రెస్ గొడ్డలి పెట్టు అని.. మైనార్టీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story