Peddapally: హస్టల్‌లో నీరు రాక పశువుల ఆసుపత్రిలో విద్యార్థుల స్నానాలు

Peddapally: హాస్టల్‌లో నీళ్లు రాకపోయినా పట్టించుకోవడం లేదు -విద్యార్ధులు

Shekhar G
Published on: 17 July 2023 6:35 PM IST
Water Problem In Hostel Student Bath In Animal Hospital
X

Peddapally: హస్టల్‌లో నీరు రాక పశువుల ఆసుపత్రిలో విద్యార్థుల స్నానాలు  

Peddapally: హాస్టల్‌లో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లోని విద్యార్థులు స్నానానికి, ఇతర అవసరాలకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉన్న పశువుల ఆసుపత్రిలో ఉన్న నీటి సౌలభ్యాన్ని వాడుకుంటున్నారు. అక్కడే స్నానాలు చేసి తిరిగి హాస్టల్‌కు చేరుకుంటున్నారు. ప్రభుత్వం విద్యార్ధుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెబుతున్నా అది అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజులుగా పశువైద్యశాలలోనే తాము స్నానాలు చేస్తున్నా...తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు చెబుతున్నారు. సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story