కాలుష్య కోరల్లో బాసర గోదావరి

కాలుష్య కోరల్లో బాసర గోదావరి
x
Highlights

బాసర పవిత్ర గోదావరిని కాలకూట విషం కలవరపెడుతోంది. నిత్యం భక్తులు స్నానమాడే గంగను ఓ పరిశ్రమనుంచి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలు కలసి అపవిత్రం...

బాసర పవిత్ర గోదావరిని కాలకూట విషం కలవరపెడుతోంది. నిత్యం భక్తులు స్నానమాడే గంగను ఓ పరిశ్రమనుంచి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలు కలసి అపవిత్రం చేస్తున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకుని తల్లిడిల్లుతున్న బాసర గోదావరిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సరస్వతీ అమ్మవారి పాదలను తాకే గోదావరి జలాలను భక్తులు తలపై చల్లుకుని పునీతులవుతారు. అలాంటి గోదావరి నది మహారాష్ట్ర సరిహద్దు ధర్మాబాద్ మండలం నయాగామ్ శివారులో ఉన్న ఆల్కహాల్ పరిశ్రమ వల్ల కాలుష్య కోరల్లో చిక్కుకుకుని తల్లిడిల్లుతోంది.

అమృతం లాంటి గోదావరి జలాల్లో లిక్కర్ పరిశ్రమ వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా వచ్చి చేరుతున్నాయి ఈ కాలుష్య వ్యర్థాలు పరిశ్రమ నుండి రెండు రకాలుగా వస్తున్నాయి. మొదటిది లిక్కర్ పరిశ్రమ వ్యర్థ పదార్థాలు గాలిలో ‌కలవదడం ద్వారా అయితే, మరొకటి లిక్కర్ తయారీ సమయంలో కొన్ని వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చి గోదావరిలో కలుస్తున్నాయని స్థానికులు అంటున్నారు.

మరోవైపు ఈ విషపూరిత పరిశ్రమ బాసర గోదావరి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ విధంగా పరిశ్రమ వేదజల్లే విష తుల్యమైన కాలుష్య కారక పదార్థాల వల్ల గోదావరీ జలాలు గరళంగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం అచరిస్తారు. ప్రస్తుతం నదీ జలాల్లో విష వ్యర్థాలు కలవడంతో స్నానం చేసిన భక్తులు చర్మ సంబంధిత వ్యాదులబారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్య కారకాలు వేదజల్లే పరిశ్రమకు సమీపంలోనే బాసర ట్రిపుల్ ఐటి ఉంది. పరిశ్రమ నుండి వేదజల్లే వ్యర్థ పదార్థాలు గాలిలో కలిసి పోతున్నాయి. గాలిని పీల్చి బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు, అద్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సంబంద వ్యాదుల బారిన పడుతున్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటికి తోడు చుట్టుపక్కల ప్రాతాల ప్రజలు పాయిజన్ లాంటి ఈ నీళ్లు త్రాగడం వల్ల ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్య కోరల్లో చిక్కుకున్న పవిత్ర గోదావరికి విముక్తి కలిగించాలని గోదావరి నదిని డంప్ యార్డ్ గా తయారు చేస్తున్నా ఆల్కహాల్ పరిశ్రమ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories