Reservoirs: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లకు జలకళ

Water Inflow to Projects in AP and Telangana
x

జల కల సంతరించుకున్న ప్రాజెక్టులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Reservoirs: ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి నదులు * శ్రీశైలంలో 816.10 అడుగుల నీటి నిల్వ

Reservoirs: తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్ట్‌ చూసినా.. ఏ నదిని చూసినా జల సిరులతో ఉప్పొంగుతున్నాయి. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలశయాలన్ని జల సవ్వడి చేస్తున్నాయి. లోకల్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీనికి తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వరదలు పోటెత్తున్నాయి. దీంతో మొన్నటి వరకు బోసిపోయి కనిపించిన ప్రాజెక్ట్‌లు దెబ్బకు నిండుకుండలా మారాయి.

శ్రీశైలం జలాశయం:

శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 85వేల 98 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 7వేల 63గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 816.10 అడుగుల నీరు నిల్వ ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు.

శ్రీరాంసాగర్ జలాశయం:

నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ జలాశయంలో జలహోరు కనిపిస్తోంది. భారీగా చేరిన నీటితో ప్రాజెక్టు కళకళలాడుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా.. ప్రస్తుతం 1085.60అడుగులుగా ఉంది.

జూరాల ప్రాజెక్ట్‎:

జూరాల ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తివేశారు.జూరాల ఇన్‎ఫ్లో 83 వేల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్‎ఫ్లో 86,673 క్యూసెక్కులు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 318.420 మీటర్లు కొనసాగుతోంది.

సోమశిల జలాశయం:

రాయలసీమ జిల్లాలో పడుతున్న భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 8,324 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,150 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 49.134 టీఎంసీలుగా ఉండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 77.988 టీఎంసీలుగా నమోదైంది.

ధవళేశ్వరం బ్యారేజీ:

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి బ్యారేజ్ నీటిమట్టం 7.45గాకొనసాగుతోంది. దీంతో అధికారులు లక్ష 19వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు, మద్య, పశ్చిమ డెల్టాలకు 10 వేల క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు.

ఎల్లంపల్లి, పులిచింతల, మిడ్‌ మానేరు:

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి, పులిచింతల, మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో 6 గేట్లను ఎత్తివేశారు. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయింది కరకట్ట నుంచి వాటర్‌ లీకై మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి పులిచింతల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories