Siddipet: దుబ్బాక నియోజకవర్గంలో కుండపోత వర్షం

Water Inflow to Pond in Dubbaka Due to Heavy Rains
x
సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Siddipet: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

Siddipet: బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంతో దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అల్వాల- సిద్ధిపేట రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కుండపోతగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు చెక్ డ్యామ్‌లు పొంగిపోర్లుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories