Warangal: నేడు వరంగల్‌ ఎంజీఎంకు సీఎం కేసీఆర్‌

Warangal: సీఎం కేసిఆర్ వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని నేడు సందర్శించనున్నారు.

Arun Chilukuri
Published on: 21 May 2021 10:03 AM IST
Warangal: KCR to Visit MGM Hospital Today
X

Warangal: నేడు వరంగల్‌ ఎంజీఎంకు సీఎం కేసీఆర్‌

Warangal: సీఎం కేసీఆర్‌ వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని నేడు సందర్శించనున్నారు. కొవిడ్ రోగుల భరోసాతోపాటు ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలోనే నేడు వరంగల్‌లోని ఎమ్‌జీఎమ్ ఆసుపత్రిని సందర్శించనున్నాట్టు సమాచారం. సీఎం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌ హన్మకొండలోని ఆర్ట్స్‌ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్తారు.

అనంతరం 11.45 గంటలకు వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శించనున్నారు. జైలు ఆవరణ, సౌకర్యాలు, ఖైదీల వసతులను పరిశీలించిన అనంతరం జైలు అధికారులు, ఖైదీలతో మాట్లాడతారని అధికారులు వెల్లడించారు. జైలు సందర్శన తర్వాత నేరుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని భోజనం చేసిన అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం కేసీఆర్‌ 2 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుంటారు. వైద్యం పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, ఆస్పత్రిలో సౌకర్యాలను పరిశీలించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story