Heavy Rain: వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం

Heavy Rain: వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం
x

Heavy Rain: వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం

Highlights

Heavy Rain: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది.

Heavy Rain: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. గతంలో 'మొంథా' తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఈ తాజా వర్షం స్థానిక ప్రజలను, రైతుల్ని ఆందోళనకు గురిచేసింది.

వరంగల్ నగరంలో ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం సుమారు అరగంట పాటు కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల మోకాల్లోతు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం వేళ కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ అకాల వర్షానికి ఎనుమాముల మార్కెట్‌లో ఆరబెట్టిన పత్తి, మొక్కజొన్న పంటలు తడిసిముద్దయ్యాయి. కష్టపడి పండించిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఇటీవల 'మొంథా' తుపాను కారణంగా పలు కాలనీలు తీవ్రంగా మునిగిపోయాయి. మళ్లీ ఇంత భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల కాలనీవాసుల్లో మరోసారి ముంపు భయం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories