Waddepally Municipal Results 2026: వడ్డేపల్లిలో ఫార్వార్డ్ బ్లాక్ సంచలనం: కుప్పకూలిన ప్రధాన పార్టీలు.. 8 వార్డుల్లో ‘సింహం’ గర్జన!

Waddepally Municipal Results 2026: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 11:43 AM IST
Waddepally Municipal Results 2026: వడ్డేపల్లిలో ఫార్వార్డ్ బ్లాక్ సంచలనం: కుప్పకూలిన ప్రధాన పార్టీలు.. 8 వార్డుల్లో ‘సింహం’ గర్జన!
X

Waddepally Municipal Results 2026: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే.. వడ్డేపల్లిలో మాత్రం ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రధాన పార్టీలకు షాక్:

మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. ఫలితాల సరళి ఇలా ఉంది:

ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB): 08 వార్డులు

బీఆర్ఎస్: 01 వార్డు

కాంగ్రెస్: 01 వార్డు

మొత్తం 10 స్థానాలకు గాను 8 చోట్ల ఫార్వార్డ్ బ్లాక్ జయకేతనం ఎగురవేయడంతో మున్సిపల్ పీఠం ఆ పార్టీ పరం కానుంది. అధికార కాంగ్రెస్ మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్కో స్థానానికే పరిమితమై చావుదెబ్బ తిన్నాయి. స్థానిక నాయకత్వంపై ఉన్న నమ్మకమే తమను గెలిపించిందని ఫార్వార్డ్ బ్లాక్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వడ్డేపల్లి వీధుల్లో ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story