Telangana: తెలంగాణ అసెంబ్లీ దగ్గర టెన్షన్‌.. టెన్షన్

Telangana: తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన వీఆర్‌ఏలు

Jyothi
Updated on: 13 Sept 2022 1:31 PM IST
VRAs Protest at Telugu Talli Flyover
X

Telangana: తెలంగాణ అసెంబ్లీ దగ్గర టెన్షన్‌.. టెన్షన్

Telangana: వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఛలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వీఆర్ఏలు అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

పెద్ద ఎత్తున వీఆర్ఏలు తరలిరావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలకు- పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులను తోసుకుంటూ వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద చౌరస్తాలో బైఠాయించారు. అదే సమయంలో మరి కొంతమంది వీఆర్ఏలు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి అసెంబ్లీ వైపు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వీఆర్ఏలు అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీఆర్ఏలను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story