వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు అంశం: కామారెడ్డి వీఆర్‌ఏ అశోక్‌ ఆత్మహత్య

VRA Ashok: కామారెడ్డి జిల్లాలో ఓ వీఆర్ఏ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 4 Sept 2022 12:24 PM IST
VRA Ashok Suicide in Kamareddy
X

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు అంశం: కామారెడ్డి వీఆర్‌ఏ అశోక్‌ ఆత్మహత్య

VRA Ashok: కామారెడ్డి జిల్లాలో ఓ వీఆర్ఏ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. నాగిరెడ్డిపేట మండలం బొల్లారంకు చెందిన వీఆర్ఏ అశోక్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీఆర్ఏలు తమ పేస్కేల్ కోసం గత కొద్దికాలంగా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ కూడా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అశోక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ముందు అశోక్ కుటుంబసభ్యులు, బంధులు ఆందోళనకు దిగారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వీఆర్‌ఏలు అశోక్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story