Top
logo

జాంబాగ్‌ డివిజన్‌లో బీజేపీ ఆందోళన.. ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం

జాంబాగ్‌ డివిజన్‌లో బీజేపీ ఆందోళన.. ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం
X
Highlights

జాంబాగ్‌ డివిజన్‌లో బీజేపీ ఆందోళనకు దిగింది. ఓట్ల గల్లంతుపై అభ్యంతరం తెలుపుతూ.. కౌంటింగ్ కేంద్రం దగ్గర...

జాంబాగ్‌ డివిజన్‌లో బీజేపీ ఆందోళనకు దిగింది. ఓట్ల గల్లంతుపై అభ్యంతరం తెలుపుతూ.. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు. 471 ఓట్లకు బదులుగా.. బాక్సులో 257 మాత్రమే ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. పోలింగ్‌ శాతం తప్పుగా వెల్లడించామని చెబుతున్నారు. కన్ఫూజన్‌లో అలా జరిగిపోయిందన్నట్లుగా అధికారులు బదులిచ్చారు. అధికారుల తీరుపై బీజేపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు.. అవసరమైతే ఇక్కడ జరిగిన ఎన్నికను రద్దు చేయాలని కూడా కోరాలని కమలనాథులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Web Titlevotes missing in Jambagh division
Next Story