మునుగోడులో నేతలకు ఓటర్ల అల్టిమేటం

Munugode: మాకు రోడ్లు వేస్తే.. మీకు ఓట్లు వేస్తాం అంటూ ఫ్లెక్సీలు

Jyothi
Published on: 26 Aug 2022 11:10 AM IST
Voters Ultimatum to Munugode leaders
X

మునుగోడులో నేతలకు ఓటర్ల అల్టిమేటం

Munugode: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేతలకు ఓటర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందే తమ డిమాండ్‌లను లేవనెత్తుతున్నారు. ఆ క్రమంలోనే చండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్తులు నిరసన చేపట్టారు. మాకు రోడ్లు వేస్తే.. మీకు ఓట్లు వేస్తాం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలతో ర్యాలీ తీశారు. రోడ్డు సౌకర్యం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌లతో మూకుమ్మడి తీర్మానం చేశారు. అంతేకాదు తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే ఓట్లు వేయబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. నో రోడ్... నో ఓటు అని ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు మునుగోడులో హాట్ టాపిక్‌గా మారాయి.

Jyothi

Jyothi

Next Story