మద్యం బాటిళ్లు, చెప్పుల దండ మెడలో వేసుకోని.. ఓ యువకుడి వెరైటీ నిరసన

Vikarabad: వికారాబాద్ తాండూరులో ఓ యువకుడి వెరైటీ నిరసన

Sandeep Eggoju
Published on: 29 Nov 2021 5:01 PM IST
Voter Rizwan Innovative Protest in Vikarabad District
X
వికారాబాద్ జిల్లాలో ఓటర్ రిజవాన్ వినూత్న నిరసన

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో పాలకుల నిర్లక్ష్యంపై ఓ పౌరుడు వెరైటీగా నిరసన తెలిపాడు నియోజక వర్గంలో అభివృద్ధి చేస్తానంటే నమ్మి ఓటేశానని కానీ రెండేళ్లుగా అధ్వాన్నమైన రోడ్లు, విపరీతమైన దుమ్ముతో నరకం అనుభవి స్తున్నామని అన్నాడు ఇలాంటి బుద్ధి లేని పాలకులను ఎంచుకున్నందుకు తనను చెప్పుతో కొట్టాలని, తన దిష్టిబొమ్మలను ఊరూరా తగల బెట్టాలని రిజ్వాన్ అనే వ్యక్తి పిలుపునిచ్చాడు.

అంతారం గేట్ దగ్గర దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసిన రిజ్వాన్ మెడలో చెప్పుల దండ, మద్యం బాటిళ్లు వేసుకుని నిరసనకు కూర్చున్నాడు. తాడూర్ లో కాలుష్యం, ఇతర సమస్యలకు కారణం తానేనని తాను వరస్ట్ ఓటర్ ననీ తనపై కోడిగుడ్లు, మురుగు నీరు పోయాలని అన్నాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story