రేవంత్ రెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy Complaint Against Revanth Reddy
x

రేవంత్ రెడ్డిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Highlights

Vishnu Vardhan Reddy: రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ దివంగ‌త నేత పి.జ‌నార్ద‌న్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Vishnu Vardhan Reddy: రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ దివంగ‌త నేత పి.జ‌నార్ద‌న్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పెద్దమ్మగుడి ఆవరణలో మైనర్పై అఘాయిత్యం జరిగిందని రేవంత్‎ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చెప్పినట్లు దేవాలయంలో అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడమే కాదు పెద్దమ్మతల్లి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన రేవంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భక్తులు మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories