'ఒకే గణపతి ముద్దు..కరోనా వద్దు' అంటున్న గ్రామాలు !

ఒకే గణపతి ముద్దు..కరోనా వద్దు అంటున్న గ్రామాలు !
x
Highlights

Villages opt for single Ganapati per village: గణేష్ ఉత్సవాలపై గ్రామాభివృద్ది కమిటీలు ఆంక్షలు పెడుతున్నాయి. ఒకే గణపతి ముద్దు కరోనా వద్దు...

Villages opt for single Ganapati per village: గణేష్ ఉత్సవాలపై గ్రామాభివృద్ది కమిటీలు ఆంక్షలు పెడుతున్నాయి. ఒకే గణపతి ముద్దు కరోనా వద్దు అంటూ పల్లెలు తీర్మాణం చేస్తున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఊరంతా ఒక్కటే విగ్రహం పెట్టి భౌతిక దూరం పాటించి పూజలు చేద్దామంటూ ఒక పల్లె నుంచి మొదలైన స్పూర్తి మెజార్టీ పల్లెలను తాకింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా భయం గణేష్ ఉత్సవాలపై పడి కొన్ని పల్లెలు ఉత్సవాలకు దూరంగా ఉంటామంటుంటే మెజార్టీ పల్లెల్లో ఏక దంతుడు ఒక్కడు చాలంటున్నారు. ఇంతకీ గణేష్ ఉత్సవాల ఇందూరు పల్లెలు పెట్టిన ఆంక్షలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. నవరాత్రులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పల్లె నుంచి పట్నం వరకు వాడవాడలా సందడి ఉంటుంది. ఐతే ఇదంతా గతం, కరోనా మహమ్మారి విజృంభనతో నిజామాబాద్ జిల్లాలోని మెజార్టీ పల్లెలు ఊరికి ఒక్కటే విగ్రహాన్ని ప్రతిష్టించాలని తీర్మాణం చేస్తున్నాయి. కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఉత్సవాలు నిర్వహిస్తే కరోనా మరింత తీవ్రరూపం దాల్చుతుందని ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఊరికి ఒక్కటే విగ్రహం పెట్టాలని కొందరు ఉత్సవాలను నిర్వహించొద్దని మరికొన్ని పల్లెలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

నిజామబాద్ జిల్లాలోని మోపాల్, మంచిప్పతో పాటు 50కి పైగా గ్రామాల్లో ఊరంతా కలిపి ఒక్కటే వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలని తీర్మాణం చేశాయి. మోపాల్ నుంచి పుట్టిన ఆలోచన ఇప్పుడు జిల్లాలోని మెజార్టీ పల్లెలను కదిలిస్తున్నాయి. మండపానికి వచ్చే వారు సైతం భౌతిక దూరం, మాస్క్ సానిటైజర్ తప్పనిసరి చేసినట్లు గ్రామస్ధులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రెండు గ్రామాల్లో ఉత్సవాలను రద్దు చేశారు. ఇంట్లో మట్టి విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేయాలని కోరారు.

తెలంగాణలో హైదరాబాద్ తరవాత ఆ స్ధాయిలో నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణేష్ మండళ్లు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి. బొజ్జ గణపయ్యలను కొలుస్తారు. ఐతే ఈ సారి ఊహించని రీతలో వచ్చిన కరోనా ముప్పుతో ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని విశ్వహింద్ పరిషత్ లాంటి సంస్ధలు పిలుపునిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో అప్రమత్తమైన గ్రామాలు ఐక్యతతో ఒక్కటై ఒక్కటే గణేష్ విగ్రహం నెలకొల్పాలని నిర్ణయిస్తున్నాయి. మండపం ఒక్కటే అయినా అక్కడ కరోనా నియంత్రణ మార్గదర్శకాలు పాటించేలా చూస్తామని అంటున్నారు నిర్వహాకులు. కరోనా కట్టడికి స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తూ స్పూర్తిగా నిలిచిన ఇందూరు పల్లెలు గణేష్ వేడుకల్లోను తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఊరికి ఒకే విగ్రహం పెట్టాలని ఇందూరు నుంచి మొదలైన తీర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పల్లెలను కదిలిస్తు్న్నాయి. ఒకే విగ్రహం నెలకొల్పేలా స్పూర్తిని నింపుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories