తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఆ చట్టం ఇప్పుడు ప్రజాప్రతినిదులకు చుక్కలు చూపిస్తోంది

తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఆ చట్టం ఇప్పుడు ప్రజాప్రతినిదులకు చుక్కలు చూపిస్తోంది
x
Highlights

గాడితప్పిన ప్రజాప్రతినిదులకు అదో బ్రహ్మాస్త్రం. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఆ చట్టం ఇప్పుడు ప్రజాప్రతినిదులకు చుక్కలు చూపిస్తోంది. పరువు కోసం అయినా...

గాడితప్పిన ప్రజాప్రతినిదులకు అదో బ్రహ్మాస్త్రం. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఆ చట్టం ఇప్పుడు ప్రజాప్రతినిదులకు చుక్కలు చూపిస్తోంది. పరువు కోసం అయినా పనులు చేయాల్సిన పరిస్దితి ఏర్పడింది ఆ నేతలకు. గ్రామాలపై ప్రభుత్వం నిఘాకి కారణమేంటి. సర్పంచ్ ల సస్సెన్షన్ పై వారి అభిప్రాయమెంటీ..?

తెలంగాణ గ్రామాల్లో ఇప్పుడు సస్పెన్షన్ భయం పట్టుకుంది. ప్రభుత్వం చేస్తున్న పనులు సమయానికి నిక్కచ్చిగా చేయలేకపోతే సర్పంచ్ లు, గ్రామీణ ప్రభుత్వ అదికారులకు చుక్కలు కనపడుతున్నాయి. కారణాలు చెబుతు పనుల జాప్యం చేస్తున్న సర్పంచ్ లను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ వేటు వేస్తోంది. అటు గ్రామంలో బాధ్యులుగా ఉండే గ్రామీణ కార్యదర్శులు, ఎంపీడీవోలకు సైతం నోటిసులు ఇచ్చేస్తోంది.

ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం గ్రామాల్లో అమలు చేస్తోంది. ఆ చట్టం ప్రకారం విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినవారిపై వేటు పడుతోంది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన 36 మంది సర్పంచ్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు సస్పెండ్‌ చేయడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు విడుదల అవుతున్న నిధులతో అన్ని గ్రామాల్లో పలు అభివ్రుద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పనుల్లో జాప్యం, పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠ ధామాలను నిర్మించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. పనితీరు సంతృప్తికరంగాలేని సర్పంచ్‌లపై కొరడా ఝళిపిస్తోంది. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో సర్పంచ్‌లు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని కలెక్టర్లతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పెదవి విరిచారు. అప్పటివరకు సర్పంచ్‌లపై ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లు ఉన్న కలెక్టర్లు వెంటనే సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల వ్యవధిలో 36 మంది గ్రామ సర్పంచ్‌లపై వేటు పడింది. అలాగే 92 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీవోలపైనా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. మరికొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో కఠిన నిబంధనలను పొందుపరిచింది. ఆ నిబందనలే ఇప్పుడు గ్రామాల్లో హాడావుడి సృష్టిస్తున్నాయి. నూతన పంచాయితీ చట్టం ప్రకారం అనేక కఠినమైన నిర్ణయాలు కూడా జిల్లా కలెక్టర్లు తీసుకుంటుడంతో గ్రామాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మరోవైపు ప్రతి జిల్లా కలెక్టర్ తమ జిల్లాలోని గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివ్రద్ది పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించి పర్యవేక్షించడంతో పనుల్లో వేగం కనపడుతోంది. అయితే ఈ చట్టం తేవడం వల్ల సర్పంచ్ లు గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి పెరిగిందనే వాదనలు వినపడుతున్నాయి ప్రాక్టికల్ గా వస్తున్న సమస్యలను పట్టించుకోవడం లేదంటు విమర్శలు సైతం వస్తున్నాయి.

కొత్త చట్టం ప్రకారం, హారితహారంలో బాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్, కార్యదర్శులను బాధ్యులను చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమార్కులకు నోటీసులు, వివరణలతో కాలయాపన చేయకుండా తక్షణమే సస్పెన్షన్‌ వేటు వేసేలా చట్టం చేసింది. కేవలం నిధుల దుర్వినియోగమే కాక పారిశుద్ధ్య నిర్వహణలో విఫలమైనా, కార్యక్రమాల అమలులో వెనుకబడినట్లు తేలినా వారి పదవులకు ఎసరుపెడుతోంది.

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం సెక్షన్‌ – (ముప్పై ఏడు ఐదు) 37 (5) విధుల పట్ల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, అలసత్వం, అక్రమ వసూళ్లకు పాల్పడినవారిని తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది. అలాగే సెక్షన్‌ 284 ప్రకారం డిసెంబర్‌ 31లోపు నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ రిపోర్టు సమర్పించని పక్షంలో నోటీసులు ఇవ్వకుండా సర్పంచ్, కార్యదర్శులను తొలగించవచ్చు. సెక్షన్‌ 43 ప్రకారం రికార్డుల నిర్వహణ, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, 100% ఇంటి పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో పనిచేయని కార్యదర్శులపైనా చర్యలు తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories