Vikarabad : వివాహిత కిడ్నాప్‌ కేసులో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు

Vikarabad : వివాహిత కిడ్నాప్‌ కేసులో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు
x
Highlights

Vikarabad : అచ్చం సినిమాల్లో జరిగినట్లు గానే వికారబాద్ లో ఆదివారం రోజున ఓ వివాహితను కొంత మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ...

Vikarabad : అచ్చం సినిమాల్లో జరిగినట్లు గానే వికారబాద్ లో ఆదివారం రోజున ఓ వివాహితను కొంత మంది కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ కిడ్నాప్ కేసును ఛేదించడానికి మొత్తం 6 బృందాలుగా ఏర్పడి గాలింపును చర్యలు చేపడుతున్నారు. దీపిక కిడ్నాప్ వ్యవహారాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు అటు అఖిల్ బంధువులను ఇటు వారి స్నేహితులను విచారిస్తున్నారు. అంతే కాదు కిడ్నాప్ జరిగి ప్రదేశం నుంచి కారు ఎటువైపు వెళ్లింది పూర్తి దృష్యాలను సీసీ కెమెరాలలో చూసే ప్రయత్నం చేయగా అవి పనిచేయకపోవడంతో వారు ప్రయణించిన కారు ఎటువైపు వెళ్లిందో కనిపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో అసలు కిడ్నాపర్లు దీపికను ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు దీపికను ఎవరు తీసుకెళ్లారు అని అనేది మాత్రం పోలీసులు బయటకి చెప్పడం లేదు. దీపిక తన భర్త వద్దే ఉందని అనుమానం వ్యక్తం చేస్తు న్నామని త్వరలో కేసు ఛేదిస్తాం అంటున్నారు.

పట్టణానికి చెందిన దీపిక ఆమె అక్కతో కలిసి ఆదివారం సాయంత్రం ఆలంపల్లి రోడ్డులో షాపింగ్‌ చేసింది. ఈ తువాత తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కొంత మంది దుండగులు వాహనంలో వచ్చి కిడ్నాప్‌ చేశారు. అనంతరం వికారాబాద్‌ బీజేఆర్‌ చౌరస్తా వైపు నుంచి పరారయ్యారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న అక్క వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తమ చెల్లెలిని ఎవరో గుర్తు తెలియని దుండగులు అపహరించారని వెంటనే తమ చెల్లెలిని కాపాడాలని ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు వెంటనే కిడ్నాప్ జరిగిన స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోతే దీపిక 2016లో ఆర్యసమాజ్‌లో అఖిల్‌ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దీపిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ, ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా గాలిస్తున్నారు. కొన్నేళ్లుగా తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. భర్తే ఆమెను కిడ్నాప్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కుటుంబ సభ్యుల ద్వారా మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపికకు ఇష్టముంటే ఇంత కిడ్నాప్ డ్రామా అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. 2016లో పెళ్లి చేసుకున్నా.. దీపిక, అఖిల్‌ నెల రోజులు కూడా కలిసి ఉండలేకపోయారని తెలిసింది. ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న దీపిక ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు డీఎస్పీ సంజీవరావు ఎప్పటికప్పుడు కేసు వివరాలు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories