SP Koti Reddy: భైరి నరేష్‌ను అరెస్ట్‌ చేశాం.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నాం..

SP Koti Reddy: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 31 Dec 2022 3:18 PM IST
Vikarabad SP Koti Reddy About Bairi Naresh Arrest
X

SP Koti Reddy: భైరి నరేష్‌ను అరెస్ట్‌ చేశాం.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నాం..

SP Koti Reddy: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలోని ఓ హోటల్‌లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా నరేష్‌పై 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను వరంగల్‌లో అరెస్ట్‌ చేసి, వికారాబాద్‌కు తరలించామని చెప్పారు ఎస్పీ కోటిరెడ్డి. కొడంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో భైరి నరేష్‌పై 153 (A), 295 (A), 298, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని చెప్పారు ఎస్పీ కోటిరెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story