Top
logo

దీపిక కిడ్నాప్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌

దీపిక కిడ్నాప్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌
X
Highlights

వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసు ఊహించని మలుపు తిరిగింది. గత మూడు రోజులగా ఆమె కోసం ...

వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసు ఊహించని మలుపు తిరిగింది. గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్న పోలీసులకు యువతి షాకిచ్చింది. తాను ఇష్టపూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లినట్టు పోలీసులకు తెలిపింది. దీపిక ఆమె భర్త అఖిల్ తో వికారాబాద్ పోలీసులు మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే తాను తన భర్త అఖిల్ తో వెళ్లినట్లు దీపిక పోలీసులతో చెప్పింది. పోలీసుల సూచన మేరకు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కి రానున్నారు. దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండేళ్ల నుంచి భర్తకి దూరంగా ఉంటున్న దీపిక ఇష్టపూర్వకంగానే భర్తతో వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్‌ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో రెండేళ్ల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే శనివారం(సెప్టెంబర్ 26,2020) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఇక ఆదివారం సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీపిక పక్కనే ఉన్న సోదరిని తోసి వెళ్లిపోయారు. దీంతో దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా దీపిక ఫోన్‌ చేయడంతో కథ సుఖాంతమైంది. మరోవైపు తమ కుమార్తెను అఖిల్‌ కిడ్నాప్‌ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Web TitleVikarabad: New twist in Deepika kidnap case
Next Story