వికారాబాద్‌ బాలిక అత్యాచారం, హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..?

Vikarabad: బాలికతో నిందితుడి మహేందర్‌కు ఏడాదిగా పరిచయం- ఎస్పీ కోటిరెడ్డి

Shireesha
Published on: 31 March 2022 3:29 PM IST
Vikarabad Girl Molestation and Assassination Case Solved | Breaking News
X

వికారాబాద్‌ బాలిక అత్యాచారం, హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..?

Vikarabad: వికారాబాద్ జిల్లాలో బాలిక రేప్ అండ్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. ప్రియుడు మహేందర్ యే నిందితుడని తేల్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. తన ఫోన్‌తో బయటకు వచ్చిన బాలికపై మహేందర్ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక ప్రతిఘటించింది.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరగ్గా.. బాలిక తల చెట్టుకు తలగడంతో స్పృహ కోల్పోయింది. అది గమనించని మహేందర్ బాలికై హత్యాచారం చేశాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక హత్య కేసులో నిందితుడు మహేందర్ అలియాస్ నాని తల్లిదండ్రులు.. తన కొడుకు తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి కనుక శిక్షించాలంటున్నారు.

బాలిక హత్యతో గ్రామస్తులు అందరూ భయపడ్డారు. మహేందర్ ఈ హత్య చేశాడా..? ఆశ్చర్య పోతున్నామంటున్నారు. చుట్టుపక్కల ఎప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడే పిల్లవాడు ఈ హత్య చేశాడా అంటే భయపడి పోతున్నామంటున్నారు. మొత్తానికి బాలికను హత్య చేసిన మహేందర్ కటకటలపాలయ్యాడు.

Shireesha

Shireesha

Next Story