logo
తెలంగాణ

వికారాబాద్‌ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో పురోగతి...

Vikarabad Girl Molestation and Assassination Case Progress | Live News
X

వికారాబాద్‌ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో పురోగతి...

Highlights

Vikarabad: మాట్లాడుతానని పిలిచి హత్యాచారానికి పాల్పడిన మహేందర్...

Vikarabad: వికారాబాద్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ప్రియుడు మహేందర్ హత్య చేసినట్లు ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఘటనకు ముందు మాట్లాడుతానని పిలిచి బాలికపై హత్యాచారానికి మహేందర్ పాల్పడినట్లు.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. ప్రియుడు మహేందర్ బాలికను బలంగా నెట్టడంతో పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి బాలిక మూర్చబోయింది.

దీంతో అనంతరం బాలిక గొంతు నులిమి ప్రియుడు హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మరోవైపు విచారణలో బాలిక తల్లి, ప్రియుడు పోలీసులకు పొంతనలేమి సమాధానాలు ఇస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి ఘటనా స్థలం నుండి పరిగెత్తాడని స్థానికులు చెబుతున్నారు. కాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందుకు తీసుకురానున్నారు.

Web TitleVikarabad Girl Molestation and Assassination Case Progress | Live News
Next Story