Vikarabad SP: సత్యమూర్తి ఫోన్ స్విచ్చాఫ్.. కారు నెంబరుతో గుర్తించగలిగాం

*ఆయన భార్య అన్నపూర్ణ మిస్టరీని కూడా త్వరలో ఛేదిస్తాం

Rama Rao
Updated on: 28 Jun 2022 3:31 PM IST
Vikarabad Family Missing Mystery  | TS News
X

Vikarabad SP: సత్యమూర్తి ఫోన్ స్విచ్చాఫ్.. కారు నెంబరుతో గుర్తించగలిగాం

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో అదృశ్యమైన సత్యమూర్తి సురక్షితంగా ఉన్నాడని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సత్యమూర్తి ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో కారు నెంబర్ ఆధారంగా గుర్తించామని వారు కాశీలో ఉన్నట్లు గుర్తించి సేఫ్ గా తీసుకొచ్చామన్నారు. ఆయన భార్య అన్నపూర్ణ కేసును కూడా త్వరలోనే ఛేదిస్తామని, ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తామన్నారు. ఇక సత్యమూర్తి వీడియోలో పెద్ద తలకాయల పేర్ల ప్రస్తావనను ఎస్పీ దాటవేశారు. పూర్తి విషయాలను దర్యాప్తు తరువాతే చెబుతామన్నారు. ఒకవేళ సత్యమూర్తి చేసిన ఆరోపణలే తప్పు కావచ్చేమో అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story