Vijayashanti: ఏడేళ్ల క్రితం అనుకున్న మొక్కును అమ్మవారికి చెల్లించుకున్నా

Vijayashanti: బీజేపీ అధికారంలోకి వస్తే మరోసారి బంగారు బోనం సమర్పిస్తా -విజయశాంతి

Sandeep Eggoju
Updated on: 1 Aug 2021 7:39 PM IST
Vijayashanti Offers Banagaru Bonam to Mhankali
X

విజయశాంతి (ట్విట్టర్ ఇమేజ్)

Vijayashanti: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు బీజేపీ నేత విజయశాంతి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి బంగారు బోనం సమర్పిస్తానని అమ్మవారిని మొక్కినట్టు చెప్పారు. రాష్ట్రంలో దొరల రాజ్యం, దొంగల రాజ్యం నడుస్తోందని విమర్శలు చేసిన విజయశాంతి.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఇక.. కరోనా నుంచి త్వరగా రాష్ట్రం కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు విజయశాంతి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story