కాంగ్రెస్‌కు విజయశాంతి గుడ్‌బై

రేపు ఢిల్లీకి రాములమ్మ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న విజయశాంతి గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయశాంతి ప్రచారం తమిళనాడులో కూడా ప్రచారం చేయించే యోచన

admin
Updated on: 23 Nov 2020 12:30 PM IST
కాంగ్రెస్‌కు విజయశాంతి గుడ్‌బై
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి.. సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పునోనున్నారు విజయశాంతి. ఆ తర్వాత ఢిల్లీలో పలువురు పార్టీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్న విజయశాంతికి బీజేపీలో చేరాక కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విజయశాంతి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలతో పాటు తమిళనాడు ఎన్నికల్లో కూడా విజయశాంతి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు విజయశాంతి గుడ్‌బై చెప్పారు. రేపు ఢిల్లీకి వెళ్లనున్న రాములమ్మ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న విజయశాంతి. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయశాంతి ప్రచారం. తమిళనాడులో కూడా ప్రచారం చేయించే యోచన

admin

admin

Next Story